Published : 15 Aug 2020 23:50 IST

ఏపీలో రాగల మూడు రోజులు వర్షాలు 

అమరావతి: ఉత్తర కోస్తా ఒడిశా దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, గాంగేటిక్‌ పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో.. రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలోని ఉభయగోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని చెప్పింది. ఇవాళ, రేపు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు రేపూ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని