వివాహ విందు.. మీ ఇంటికే.. 

వివాహ భోజనంబు.. అంటూ ఆరాటపడే వారి కోసం ఓ ప్రత్యామ్నాయం ఉందంటూ సోషల్‌ మీడియా పోస్టులు వివరిస్తున్నాయి.

Updated : 15 Dec 2020 11:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా వైరస్‌ వ్యాప్తితో వివాహం తదితర వేడుకల స్వరూప స్వభావాలే మారిపోయాయి. కొవిడ్‌ వల్ల మారిన పరిస్థితుల్లో నిబంధనలకు అనుగుణంగా  మార్పులు, చేర్పులకు గురయ్యాయి. ఆన్‌లైన్‌ వివాహాలు, వీడియోలో ఆశీర్వాదాలు ఇప్పుడు సాధారణమయ్యాయి.  కానీ అతిథులకు రుచికరమైన విందు అందించనిదే వివాహానికి పరిపూర్ణత లభించదని పలువురి అభిప్రాయం. మరి వివాహ భోజనంబు.. అంటూ ఆరాటపడే వారి కోసం ఓ ప్రత్యామ్నాయం ఉందంటూ సోషల్‌ మీడియా పోస్టులు వివరిస్తున్నాయి. మన దేశానికే చెందిన ఈ వివాహ విందు విధానం.. సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ విందు ఎలా ఏర్పాటు చేశారంటే..

దీనిలో షడ్రసోపేతమైన విందు భోజనాన్ని ఇంటికే అందించే ఏర్పాటు చేశారు. టిఫిన్‌ క్యారేజీలలో భోజనాన్ని అమర్చి.. దానిని చక్కటి బుట్టల్లో ఉంచి.. అరిటాకులతో సహా అతిథుల ఇంటి వద్దకే పంపిస్తున్నారు. విందులో ఏఏ పదార్థాలు ఉన్నాయో జాబితాను కూడా దానికి జతచేయటం విశేషం. కాగా, సమయోచితమైన ఈ ఆలోచన పలువురితో శభాష్‌ అనిపించుకుంటోంది. కొవిడ్‌ కాలంలో అత్యంత ఆచరణ యోగ్యమైన పరిష్కారం ఇదే అని నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు. వివాహాది కార్యక్రమాలకు హాజరై కొవిడ్‌ను కొని తెచ్చుకోకుండా.. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వరకూ దీనిని పాటిస్తే సరి అంటున్నారు. ఇక ఈ పద్ధతిలో  ఆహారం వృథా కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి..

టబ్‌లో పులి.. ఏం చేసిందంటే..

విహార యాత్రకు వెళుతున్నారా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని