ఈ ఫోన్లలో వాట్సాప్‌ ఇక పనిచేయదు

2021 జనవరి 1నుంచి కొన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదట. కంగారుపడకండి. ఇది అన్ని ఫోన్లకు వర్తించదు.

Published : 18 Dec 2020 01:36 IST

దిల్లీ: 2021 జనవరి 1నుంచి కొన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదట. కంగారుపడకండి. ఇది అన్ని ఫోన్లకు వర్తించదు. వివరాల ప్రకారం ఐఫోన్‌లో ఐవోఎస్‌ 9, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో 4.0.3 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కన్నా ముందువి(పాతవి) ఉంటే వాటిలో మాత్రం వాట్సాప్‌ తన సేవలను నిలిపివేయనుంది. ఇప్పటికే వాట్సాప్‌ తన వినియోగదారులకు అందించే సేవల్లో చాలా మార్పులు చేసింది. ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా వచ్చే ఏడాది నుంచి కొన్ని ఫోన్లలో సేవలను నిలిపేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏఏ ఫోన్లలో..
నివేదికల ప్రకారం ఐఫోన్లలో ఐవోఎస్‌ 9 అంటే ఐఫోన్‌ 4, దానికన్నా ముందు వచ్చిన మోడళ్ల ఐఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదు. మీ దగ్గర ఐఫోన్‌ 4ఎస్‌, ఐఫోన్‌ 5, ఐఫోన్‌ 5ఎస్‌, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6ఎస్‌ ఫోన్లు ఉన్నట్లయితే వాటిని ఐవోఎస్‌ 9కు అప్డేట్‌ చేసి వాట్సాప్‌ను వాడుకోవచ్చు. ఐఫోన్‌ 6ఎస్‌, 6 ప్లస్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ ఫస్ట్‌ జనరేషన్‌ ఫోన్లను ఐవోఎస్‌ 14కు అప్డేట్‌ చేసుకోవాలి. అదే ఆండ్రాయిడ్‌ ఫోన్లలో అయితే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 4.0.3కు అప్డేట్‌ చేసుకోవాలి. ఈ వెర్షన్‌ హెచ్‌టీసీ డిజైర్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ బ్లాక్‌, మోటరోలా డ్రోయిడ్‌ రాజర్‌, ది శామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌2, ఇంకా చాలా ఫోన్లలో ఉండదు. కాబట్టి ఈ ఫోన్లలో 2021 నుంచి వాట్సాప్‌ ఉపయోగించడం కుదరదు.
ఏ వెర్షనో తెలుసుకోండిలా..
మీరు ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌లో ఏ ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ఉందో తెలీదా.. అయితే ఇలా తెలుసుకోండి. మీరు ఐఫోన్‌ ఉపయోగిస్తున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేసి తర్వాత ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.( సెట్టింగ్స్‌- జనరల్‌- ఇన్ఫర్మేషన్‌). మీరు ఆండ్రాయిడ్‌ మొబైల్‌ను ఉపయోగిస్తున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎబౌట్‌ ఫోన్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే మీకు మీ ఫోన్‌ వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే మీ ఫోన్లలో కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్డేట్‌ ఆప్షన్‌ ఉంటే వాటిని అప్డేట్‌ చేయండి. ఆ ఆప్షన్‌ మీకు రాలేదంటే మీరు కొత్త ఫోన్‌ కొనక తప్పదు.
వాట్సాప్‌ ఇప్పటికే అనేక కొత్త ఫీచర్లు వినియోగంలోకి తెచ్చింది. అందులో వాట్సాప్‌ పేమెంట్స్‌ ఒకటి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) భాగస్వామ్యంతో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్ఫేస్‌(యూపీఐ) ను ఉపయోగించి పేమెంట్స్‌ చేయనుంది. ఇందుకోసం 160 బ్యాంకులతో అనుసంధానమైంది. భారతీయ వినియోగదారుల కోసం ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జియోపేమెంట్స్‌తో జత కట్టింది.

ఇవీ చదవండి..

వాట్సాప్‌ కొత్త ఫీచర్‌.. ఉపయోగాలేంటో తెలుసా?

ఫేస్‌బుక్‌పై అమెరికా పోరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని