చలిపులి పంజా విసరొద్దంటే!
చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పులు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ కాలంలో సాధారణంగానే జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు వేధిస్తుంటాయి. చర్మం పాడవటం, కీళ్లు బిగుసుకుపోవటం తదితరాలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో
ఇంటర్నెట్ డెస్క్ : చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పులు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ కాలంలో సాధారణంగానే జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు వేధిస్తుంటాయి. చర్మం పాడవటం, కీళ్లు బిగుసుకుపోవటం తదితరాలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో... ఈ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుని, చలిపులిపై మనమే పంజా విసురుదాం!
ఈ కాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే జీవన శైలిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. శీతల గాలికి చర్మం పొడిబారి పగుళ్లు వచ్చి దురద పెడుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రాత్రిపూట పడుకునే ముందు చర్మానికి కొబ్బరి, ఆలివ్ నూనె వంటివి రాసుకోవాలి. చల్లగాలికి ఎక్కువగా తిరగకూడదు. బయటకు వెళ్లాల్సి వస్తే దుస్తులు నిండుగా ధరించటం, స్వెట్టర్ వంటివి వేసుకోవటం మంచిది.
ఆస్తమాతో ఇబ్బంది పడుతున్న వారు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు తగినంత వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. జలుబు, దగ్గు వంటివి దరిచేరకుండా ఉండటం కోసం వేడి నీటితో ఆవిరి పట్టుకోవాలి. పాలలో కాసింత మిరియాల పొడి కలుపుకొని తాగాలి. ఇలా చేయటం వల్ల దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో కీళ్లన్నీ బాగా బిగుసుకుపోయి కదలికల్ని కష్టంగా మారుస్తాయి. ఈ సమస్యను నివారించుకునేందుకు కీళ్లను తరచూ కదిలిస్తూ ఉండాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయాలి. కాసేపు అటుఇటు నడవటం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం దొరుకుతుంది. నొప్పుల నుంచి ఉపశమనమూ లభిస్తుంది. చలికాలంలో దాహం వేయకున్నా తరచుగా నీరు తాగాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. జీవక్రియారేటు కూడా పడిపోతుంది. ఆహారం వేడివేడిగా, తాజాగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించటం వల్ల చలిపులికి చెక్ పెట్టొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు