చరవాణి వెలుతురులో గర్భిణికి ప్రసవం!

కర్ణాటకలో ఓ ఆసుపత్రి వైద్యులు పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన మహిళకు చరవాణి వెలుతురులో ప్రసవం చేశారు.

Updated : 13 Nov 2020 04:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలో ఓ ఆసుపత్రి వైద్యులు పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన మహిళకు చరవాణి వెలుతురులో ప్రసవం చేశారు. సిద్దమ్మ అనే మహిళ ప్రసవ వేదనతో కలబురిగిలోని కండూరులో స్థానిక ఆసుపత్రికి వచ్చారు. మహిళ ఆసుపత్రికి వచ్చే సమయానికి ఆ ప్రాంతంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో వైద్యులు చరవాణి టార్చి వెలుతురులోనే ప్రసవం చేయగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆసుపత్రిలో పవర్‌ బ్యాకప్‌ అవకాశం లేకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను కోరారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని