వీఆర్వోపై మహిళా రైతుల దాడి

భూప్రక్షాళనలో తమ భూమి తక్కువగా నమోదు చేశారనే ఆగ్రహంతో రెవెన్యూ అధికారిపై మహిళా రైతులు దాడికి దిగారు.

Published : 04 Nov 2020 00:58 IST

తాంసి: భూప్రక్షాళనలో తమ భూమి తక్కువగా నమోదు చేశారనే ఆగ్రహంతో రెవెన్యూ అధికారిపై మహిళా రైతులు దాడికి దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం కుప్పర్ల గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని వడ్డాడి గ్రమానికి చెందిన రైతు గంగారాంకు అదే గ్రామంలో 3.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం 1.20 ఎకరాలుగానే నమోదు అయింది. రికార్డుల్లో ఈ వివరాలను సరిచేయాలంటూ గతంలో వీఆర్వోగా విధులు నిర్వర్తించిన రోహిత్ చుట్టూ కొన్ని నెలలుగా తిరిగారు. ఎన్నిసార్లు అడిగినా సరిగా సమాధానం చెప్పకుండా తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని మహిళా రైతులు ఆరోపించారు. ధరణి పోర్టల్‌పై అవగాహన కల్పించేందుకు వడ్డాడి గ్రామానికి రెవెన్యూ అధికారులతో సహా రోహిత్‌ కూడా హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత రైతు కుటుంబసభ్యులు కార్యాలయానికి చేరుకొని వీఆర్వోపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న మండల ఎమ్మార్వో.. భూమి సర్వే చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళా రైతులు శాంతించి అక్కడనుంచి వెళ్లిపోయారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని