
బడ్జెట్: మీ సలహాలు ఏంటి?
దిల్లీ: 2021-22 వార్షిక బడ్జెట్లో ప్రజల ఆలోచనలూ పంచుకొనేందుకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పిస్తోంది. దీని కోసం మైజీవోవీ అనే ఆన్లైన్ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేసింది. సాధారణ ప్రజలెవరైనా బడ్జెట్లో పెట్టాలనుకున్న కొత్త ఆలోచనలను ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఈ పోర్టల్ నవంబరు 15న ప్రారంభమైంది. నవంబరు 30 వరకు ప్రజలు వారి అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకోవచ్చు. వారి సూచనలు మెరుగైనవి అయితే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వాటిని చర్చించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ట్వీట్లో తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ట్విటర్ అకౌంట్లో శనివారం పోస్టు చేశారు.
దేశ ప్రజలను అన్నింటిలో భాగస్వాములుగా చేయడమే ప్రజాస్వామ్యానికి మూలం ఆర్థికశాఖ తెలిపింది. ఏటా బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రజల అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తోంది. మైజీవోవీ.ఇన్‌లో అభిప్రాయాలు తెలియజేసేందుకు ముందుగా లాగిన్ అవ్వాలి. అందుకోసం మీ పేరు, రాష్ట్రం, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబరు, ఏ అంశంలో మీ ఆలోచన పంచుకోవాలని అనుకుంటున్నారో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 500 పదాలకు మించకుండా మీ ఆలోచనలు ఆ పోర్టల్‌లో సమర్పించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారు.. డీజీపీకి చంద్రబాబు లేఖ
-
Politics News
Maharashtra Crisis: శివసేనను భాజపా అంతం చేయాలనుకుంటోంది: ఉద్ధవ్ ఠాక్రే
-
Crime News
Crime News: వివాహమైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి
-
India News
India Corona : 90 వేలు దాటిన క్రియాశీల కేసులు..
-
Sports News
Ind vs Eng: అప్పుడు ఆడారు.. గెలిపించారు.. ఇప్పుడు ఎలా ఆడతారో?
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ ఫైట్.. వీఎఫ్ఎక్స్ కథ ఇదీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!