విశాఖ బీచ్‌రోడ్డులో యువకుల హల్‌చల్!

విశాఖ బీచ్‌రోడ్డులో కొందరు యువకులు హల్‌చల్‌ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వేగంగా వెలుతున్న కారును ఆపటంతో అందులోని యువకులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దాంతో మాటామటా

Published : 30 Dec 2020 18:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : విశాఖ బీచ్‌రోడ్డులో కొందరు యువకులు హల్‌చల్‌ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వేగంగా వెళుతున్న కారును ఆపటంతో అందులోని యువకులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దాంతో మాటామటా పెరిగి కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఆ తరువాత ఈ విషయాన్ని సీఐకి వివరించిన కానిస్టేబుళ్లు లిఖిత పూర్వక ఫిర్యాదును ఇచ్చారు. కానీ సీఐ కేసు నమోదు చేయలేదు. బీచ్‌ రోడ్‌ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చూసిన పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారంటూ సీఐని వీఆర్‌కు పంపారు. ఆ తరువాత నిందితులపై కేసు నమోదు చేశారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని