Nellore: కారుపై పెద్దపులి దాడి.. నెల్లూరు జిల్లాలో ఘటన

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది.

Updated : 17 Jun 2024 19:09 IST

మర్రిపాడు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారుపై అది ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో కారులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. పులిని తప్పించే క్రమంలో కారు బోల్తా పడింది. వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. కారు ఢీకొనడంతో పులికి గాయాలయ్యాయి. అలాగే ఈడ్చుకుంటూ అది అడవిలోకి వెళ్లిందని స్థానికులు తెలిపారు. బద్వేల్ నుంచి నెల్లూరు వెళ్తుండగా కదిరినాయుడుపల్లి అటవీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పులి దాడి సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు, మర్రిపాడు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని