వైరల్‌: నెటిజన్ల హృదయాలు దోచిన రైతు

అన్నీ ఉన్నా మనలో చాలా మంది ఇతరులపై ఆధారపడుతుంటారు. పరాన్నజీవిగా కాలం వెళ్లదీస్తుంటారు. తన కాళ్లమీద నిలబడాలన్న ఆలోచన దరిదాపుల్లోకి కూడా రానీయరు. అలాంటిది దివ్యాంగుడైన ఈ రైతు.. ఇతరులపై.............

Published : 18 Sep 2020 02:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్నీ ఉన్నా మనలో చాలా మంది ఇతరులపై ఆధారపడుతుంటారు. పరాన్నజీవిగా కాలం వెళ్లదీస్తుంటారు. తన కాళ్లమీద నిలబడాలన్న ఆలోచన దరిదాపుల్లోకి కూడా రానీయరు. అలాంటిది దివ్యాంగుడైన ఈ రైతు.. ఇతరులపై ఆధారపడకుండా జీవితం కొనసాగిస్తున్నాడు. శరీరం సహకరించకున్నా పొలం పనులు చేసుకుంటూ నలుగురిలో స్ఫూర్తి నింపుతున్నాడు.

సుధా రామెన్‌ అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి తన ట్విటర్‌లో ఇటీవల ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. అందులోని వ్యక్తి ఎవరు? ఎక్కడి వారు అనే వివరాలు వెల్లడించలేదు. కానీ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తూ ఈ విధంగా ట్వీట్‌ చేశారు. ‘‘ప్రపంచంలో చాలా మంది పనిచేయకుండా ఉండేందుకు ఏదో వంక వెతుక్కునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ ఒక హీరో ఉన్నారు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతున్నారు. అతడి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు’’ అని ట్వీటారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. సదరు రైతు కష్టాన్ని నెటిజన్లు ప్రశంసలతో మంచెత్తుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని