
Published : 08 Nov 2021 01:14 IST
Karnataka: భార్యపై ప్రేమతో.. ఇంట్లోనే విగ్రహం!
బెంగళూరు: మరణించిన తన భార్య ఎప్పటికీ కళ్లముందే ఉండాలని కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. భార్యపై ప్రేమతో ఆమె విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో నెలకొల్పాడు. బెల్గావికి చెందిన శివ, మీనాభాయి భార్యాభర్తలు. కొంతకాలం క్రితం మీనాభాయి అనారోగ్యంతో మృతి చెందారు. తీవ్ర మనస్థాపానికి గురైన శివ.. భార్య ఎప్పటికీ తనతోపాటే ఉండాలనే ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో ఆమె విగ్రహాన్ని తయారు చేయించాడు. దీపావళి వేళ భారీ స్థాయిలో వేడుక నిర్వహించి భార్య విగ్రహాన్ని తన ఇంటి మధ్యలో ప్రతిష్ఠించాడు. భవిష్యత్‌లో మీనాభాయి పేరుతో బెల్గావిలో ఓ ఆస్పత్రి నిర్మించనున్నట్లు శివ తెలిపాడు.
ఇవీ చదవండి
Advertisement
Tags :