Maharashtra: 25ఏళ్ల యువకుడు 1,850కిలోమీటర్లు నడిచాడు.. ఎందుకో తెలుసా..!

 ‘లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న స్వామి వివేకానంద సూక్తికి నిదర్శనంగా నిలిచాడు ఈ యువకుడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చేతులు కట్టుకొని కూర్చోకుండా తనవంతుగా సామాజిక సేవ చేస్తున్నాడు.

Published : 30 Apr 2022 02:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి’ అన్న స్వామి వివేకానంద సూక్తికి నిదర్శనంగా నిలిచాడు ఈ యువకుడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చేతులు కట్టుకొని కూర్చోకుండా తనవంతుగా సామాజిక సేవ చేస్తున్నాడు. దీని కోసం ఏకంగా 1,850 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. రైతుల ఆత్మహత్యలు, నీటి కొరత సమస్యలు, ప్లాస్టిక్‌ వినియోగం పై చలించిన అతను ప్రజల్లో అవగాహన తీసుకురావాలని గ్రామ గ్రామానికి వెళ్లి గ్లోబల్‌ వార్మింగ్‌పై అక్కడ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలో రత్నగిరిలోని నర్వాన్‌ గ్రామానికి చెందిన అశుతోష్‌ జోషి తన పాఠశాల విద్యను చిప్లూన్‌ తహసీల్‌లో పూర్తి చేశాడు. తర్వాత ముంబయిలోని మోడల్‌ ఆర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో, పుణెలోని భారతి విద్యాపీఠ్‌లో చదువు కొనసాగించారు. తర్వాత ఇంగ్లాండ్‌ వెళ్లి ఫైన్‌ ఆర్ట్స్‌లో విద్యను పూర్తి చేశాడు. చదువు ముగిశాక ఫొటోగ్రఫీ రంగాన్ని ఎంచుకున్న ఆయన స్కాట్లాండ్‌, స్పెయిన్‌, ఇంగ్లాండ్‌లలో పని చేశాడు.

భారత్‌కు వచ్చాకా ఇక్కడ పరిస్థితులను చూసి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాడు. ఏప్రిల్‌ 10న తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మహారాష్ట్ర నర్వాన్ బీచ్ నుంచి మెదలు పెట్టి ఒడిశాలోని పురి వరకు 1,850 కిలోమీటర్లు నడిచాడు. అన్ని గ్రామాల్లోని సర్పంచులను కలిసి అక్కడ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. తన ప్రయాణంపై జోషి మాట్లాడుతూ.. ‘దీని కోసం 6-7 సంవత్సరాల నుంచి నడకను ప్రాక్టీస్‌ చేశాను. ఆరు నెలలుగా ఈ పర్యటన కోసం నన్ను నేను సిద్ధం చేసుకున్నాను’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు