కలెక్టర్ గారూ.. నా బిడ్డ ప్రాణాలు కాపాడండి

కరోనా మహమ్మారి దుర్భర పరిస్థితులకు దారితీస్తోంది. బాధితులతో ఆసుపత్రులు నిండిపోవడంతో మరికొందరు దిక్కుతోచని స్థితిలో నరకయాతన అనుభవిస్తున్నారు. తమను కాపాడాలంటూ అర్థిస్తున్నారు....

Published : 09 May 2021 13:10 IST

మామిడికుదురు: కరోనా మహమ్మారి దుర్భర పరిస్థితులకు దారితీస్తోంది. బాధితులతో ఆసుపత్రులు నిండిపోవడంతో మరికొందరు దిక్కుతోచని స్థితిలో నరకయాతన అనుభవిస్తున్నారు. తమను కాపాడాలంటూ అర్థిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా సోకి ప్రాణాపాయంతో  సతమతమవుతున్న తన ఏడు నెలల బిడ్డను బతికించాలంటూ  ఓ తల్లి కన్నీటితో కలెక్టర్‌ను వేడుకొంది. మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామానికి చెందిన మహిళ తనతో పాటు తన కుమారుడుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపింది.  కుమారుడిని  చేర్చుకోవాలంటూ మూడు రోజుల నుంచి ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఎవరు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నా బిడ్డ ప్రాణాలు కాపాడండి కలెక్టర్ గారూ.. అంటూ కన్నీటితో తల్లి వేడుకొంటున్న వీడియో కంటతడి పెట్టిస్తోంది.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని