వైద్యుడి మాస్క్‌ తీస్తున్న శిశువు..వైరల్‌ ఫొటో 

అప్పుడే పుట్టిన శిశువు పక్కనే ఉన్న వైద్యుడి మాస్క్‌ తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉన్న ఒక దృశ్యం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 15 Oct 2020 19:53 IST

దుబాయ్: అప్పుడే పుట్టిన శిశువు పక్కనే ఉన్న వైద్యుడి మాస్క్‌ తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉన్న ఒక దృశ్యం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకున్న తరుణంలో చక్కర్లు కొడుతోన్న ఈ చిత్రం  నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వైరస్‌ ప్రభావం మొదలైన దగ్గరి నుంచి దాని వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వాలు మాస్క్‌ల వినియోగాన్ని తప్పనిసరి చేశాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాటిని పాటిస్తున్నా సరే, భయం భయంగా బతకాల్సిన పరిస్థితి. దాంతో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా, వైరస్‌ ఎప్పుడు తగ్గుతుందా, మాస్క్‌లు తీసి ఎప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటామా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ చిత్రాన్ని చూసి నెటిజన్లు ..‘‘నేను చూసిన అందమైన చిత్రం ఇది. మనం త్వరలో మాస్కులు తీస్తామని ఆశిద్దాం’, ‘త్వరలో మాస్కులు తీసేస్తాం’, ‘ఫొటో ఆఫ్ ది 2020’ అంటూ కామెంట్లు చేశారు.

కాగా, దుబాయ్‌కు చెందిన ఒక వైద్యుడి ఇన్‌స్టాగ్రాం ఖాతాను నుంచి ఈ చిత్రం నెట్టింట్లో దర్శనమిచ్చింది. ‘మనం త్వరలో మాస్కులు తీయబోతున్నాం అనేదానికి ఇది చిహ్నం’ అని ఆ యూజర్‌ వ్యాఖ్యను జోడించారు. అయితే ఈ దృశ్యం ఎప్పటిదో మాత్రం స్పష్టత లేదు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts