Death Certificate: తన డెత్ సర్టిఫికెట్‌ పోయిందంటూ ప్రకటన..! వైరల్‌గా మారిన పోస్ట్‌!

సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రకాల వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తూ ఉంటారు. వాటిల్లొ ఆశ్చర్యానికి గురి చేసేవి కొన్ని ఉంటే, ఆలోచింపజేసేవి మరికొన్ని ఉంటాయి. ఇంకొన్ని నవ్వును పుట్టిస్తుంటాయి.

Updated : 24 Sep 2022 05:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లొ ఎన్నో రకాల వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తూ ఉంటారు. వాటిల్లో ఆశ్చర్యానికి గురి చేసేవి కొన్ని ఉంటే, ఆలోచింపజేసేవి మరికొన్ని ఉంటాయి. ఇంకొన్ని నవ్వును పుట్టిస్తుంటాయి. ఓ వ్యక్తి ఇచ్చిన ప్రకటన ఎంతోమందిని నవ్వుకునేలా చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఐపీఎస్‌ అధికారి రుపిన్‌ శర్మ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘దిస్‌ హేపెన్స్‌ వోన్లీ ఇన్‌ ఇండియా’ అంటూ క్యాప్షన్ జత చేశారు.

ఇంతకీ ఏమిటా పోస్టు.. ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్‌ ( మరణ ధ్రువీకరణ పత్రం)  పోగొట్టుకున్నట్లు ఓ పత్రికలో ప్రకటన ఇచ్చాడు. 07-09-2022న అస్సాంలోని లందింగ్‌ బజార్‌ వద్ద ఘటన జరిగినట్లు పేర్కొన్నాడు. ఈ ప్రకటనలో రిజిస్ట్రేషన్‌ నంబరు, వరుస సంఖ్య కూడా ఉన్నాయి. ఈ పోస్టును వీక్షించిన వినియోగదారుల్లో ఒకరు ఆ వ్యక్తి తన సర్టిఫికెట్‌ స్వర్గం నుంచి ఇవ్వాలని అడుగుతున్నాడేమో అని నవ్వుతూ కామెంట్‌ చేశారు. మరో వినియోగదారుడు ఎవరో ఓ వ్యక్తి తన డెత్‌ సర్టిఫికెట్‌ పోగొట్టుకున్నాడు. దొరికినవాళ్లు అతనికి ఇచ్చేయండంటూ కామెంట్‌ చేశారు. ఇలా పలువురు వినియోగదారులు తమ అభిప్రాయాలను ట్విటర్‌ వేదికపై పంచుకున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని