Narayana: రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక: మంత్రి నారాయణ

అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు.

Updated : 15 Jun 2024 19:05 IST

అమరావతి: అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని అభివృద్ధిపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉంది. రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తవుతుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.  అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలను  రైతులు అందజేశారు. కేవలం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చారు. గతంలో రూ.48వేల కోట్లతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించాం. రూ.9వేల కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించాం.

అనేక భవన నిర్మాణాలు వివిధ దశల్లోనే నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యతను నాపై ఉంచారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తా. గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపింది. చెత్తపన్నుతో సామాన్యులు బాగా ఇబ్బందులు పడ్డారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో 11 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించాం. వాటిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. త్వరలోనే అన్ని సౌకర్యాలతో ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం’’ అని నారాయణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని