ల్యాప్‌టాప్‌ కొట్టేసి.. యజమానికే చిత్రమైన ఆఫర్ ఇచ్చిన దొంగ..!

‘నిన్న నేను మీ ల్యాప్‌టాప్‌ను దొంగలించాను. నా కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నాను. నాకు డబ్బు కావాలి. అందుకే దొంగతనానికి పాల్పడ్డాను’ అంటూ చోరీ చేసిన వ్యక్తే యజమానికి క్షమాపణ చెప్పడం గమనార్హం.

Updated : 31 Oct 2022 13:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఓ ల్యాప్‌టాప్ యజమానికి చిత్రమైన అనుభవం ఎదురైంది. దానిని కొట్టేసిన దొంగ అతడికి  క్షమాపణలు చెప్పడమే కాకుండా.. ఓ చిత్రమైన ఆఫర్‌ కూడా ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

‘నిన్న నేను మీ ల్యాప్‌టాప్‌ను దొంగలించాను. నా కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నాను. నాకు డబ్బు కావాలి. అందుకే దొంగతనానికి పాల్పడ్డాను. మీరు ఒక పరిశోధనకు సంబంధించిన పనిలో బిజీగా ఉన్నారని తెలుసు. దానికి సంబంధించిన ఫైల్స్‌ను పంపాను. ఇంకేదైనా పంపించాల్సింది ఉంటే.. సోమవారం కల్లా తెలియజేయండి. ఎందుకంటే ఆ తర్వాత నేను దీనిని అమ్మేస్తాను. అందుకోసం నాకో కస్టమర్ దొరికాడు’ అంటూ క్షమాపణలు కోరాడు. దానికి సంబంధించిన నోట్‌ను ఆ యజమానికి ఇ-మెయిల్ చేశాడు. దీనిని ఆ యజమాని ట్విటర్‌లో షేర్ చేసి, తల బాదుకున్నాడు. ‘వారు నా ల్యాప్‌ట్యాప్‌ దొంగలించి, నా ఇ-మెయిల్‌ నుంచి నాకు మెయిల్ చేశారు. ఇందుకు నేను నవ్వాలా..? ఏడ్వాలా..?’ అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేశారు. ఆ యజమాని దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని