Pawan Kalyan: గన్నవరం ఎయిర్‌పోర్టులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఘన స్వాగతం

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు.

Updated : 18 Jun 2024 11:25 IST

అమరావతి: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయల్దేరారు.

పవన్ నేడు సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి రానున్న ఆయన..  రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బుధవారం తన ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని