Ts News: దిల్లీలోని తెలంగాణ భవన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం
దిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

దిల్లీ: దిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన తెలంగాణ భవన్ సిబ్బంది ఆమెను ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. శేజల్ గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తోంది. మానసికంగా , లైంగికంగా ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది.
రెండ్రోజుల క్రితం దిల్లీలోని మహిళా కమిషన్, హెచ్‌ఆర్సీని కలిసి ఫిర్యాదు కూడా చేసింది. భారాసకు చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తూ.. చంపుతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి భయాందోళనలకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఫిర్యాదులో వేడుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Devara: ‘దేవర’.. ఒక్క సంభాషణా కట్ చేయలేం.. పార్ట్ 2 ప్రకటించిన కొరటాల శివ
-
Rahul Gandhi: అమ్మకు రాహుల్ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..?
-
Supriya Sule: ‘హనీమూన్’ ముగియక ముందే.. మహా ప్రభుత్వంలో ముసలం?
-
Raviteja: ఆ పదాన్ని వాడడం మానేయాలని అభ్యర్థిస్తున్నా: రవితేజ
-
Vivo mobiles: 50MP సెల్ఫీ కెమెరాతో వీవో కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లివే..!
-
Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా