Aadhaar card: ఇకపై ఆ పరీక్షల్లోనూ గుర్తింపు కార్డుగా చూపొచ్చు..!

విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు అవసరమైన జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కార్డుగా ఇకపై ఆధార్‌ కార్డును చూపొచ్చు.

Published : 01 Jul 2021 01:23 IST

దిల్లీ: విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు అవసరమైన జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కార్డుగా ఇకపై ఆధార్‌ కార్డును చూపొచ్చు. ఈ మేరకు ఎడ్యేకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌(ఈటీఎస్‌) వెల్లడించింది. జులై 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. గతంలో ఈ పరీక్షలకు హాజరవ్వాలంటే గుర్తింపు కార్డుగా పాస్‌పోర్టును మాత్రమే చూపాల్సివచ్చేది. కరోనా నేపథ్యంలో పాస్‌పోర్టు పొందడానికి చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఈటీఎస్ పేర్కొంది. అయితే ఆధార్‌ కార్డును గుర్తింపు కార్డుగా తాత్కాలికంగానే పరిగణించనున్నట్టు తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు గుర్తింపు కార్డుగా ఆధార్‌ వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీఆర్‌ఈ, టోఫెల్ ప్రాథమిక పరీక్షలు సహా నిర్ణీత కేంద్రాల వద్ద నిర్వహించే పరీక్షలకు ఈటీఎస్ తాజా నిర్ణయం వర్తిస్తుంది. ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే టోఫెల్‌ ఎసెన్షియల్‌ టెస్ట్‌, అక్టోబరు నుంచి మొదలయ్యే జీఆర్‌ఈ ప్రత్యేక అంశాల పరీక్షలకు సైతం ఆధార్‌ను గుర్తింపు కార్డుగా చూపించొచ్చని తమ వెబ్‌సైట్‌లో ఈటీఎస్‌ వెల్లడించింది. ‌దీంతో అభ్యర్థులకు ఈ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ సులభతరమైంది. అమెరికా సహా పలు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి జీఆర్‌ఈ, టోఫెల్‌లను ప్రామాణిక పరీక్షలుగా పరిగణిస్తారు. ఈ పరీక్షలను ఈటీఎస్ నిర్వహిస్తుంది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు