
Andhra News: నన్ను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదేమో?: ఏబీ వెంకటేశ్వరరావు
విజయవాడ: తనను కలవడం ఏపీ సీఎస్ సమీర్‌శర్మకు ఇష్టం లేదేమోనని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) అన్నారు. తన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని హైకోర్టు తేల్చిందని చెప్పారు. ఈ విషయంలో చట్టప్రకారమే తాను ముందుకెళ్లానన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడారు.
ఏబీవీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి వెయిటింగ్ పీరియడ్‌గా పరిగణిస్తామని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏబీవీ జీఏడీలో రిపోర్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘జీఏడీలో రిపోర్ట్ చేయడం వరకే నా పని. రెండేళ్ల సస్పెన్షన్ గురించి నేను మాట్లాడటం లేదు. అయితే ప్రభుత్వం జారీ చేసి ఉత్తర్వును సరిచేయాలని కోరేందుకు సీఎస్ సమీర్ శర్మను కలవాలని అనుకున్నా. కానీ వినతిపత్రాన్ని వ్యక్తిగత సహాయకుడు (పీఏ)కు ఇచ్చి వెళ్లాలని సూచించారు. నన్ను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదేమో? నా వినతిపత్రం చదివితే కదా దానిలో ఏముందో తెలిసేది! పోస్టింగ్ ఇవ్వలేదు.. జీతం ఇచ్చేందుకు ఇబ్బందేంటి? కొంతమందిని ఏళ్ల తరబడి వీఆర్‌లో ఉంచి జీతాలు ఇవ్వడం లేదు. తప్పు చేస్తే శిక్షించాలి లేదా సమయానికి జీతం ఇవ్వాలి. సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను ఏదైనా అనే ముందు ఎస్పీలు, ఇతర అధికారులను అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి’’ అని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: అమరావతి సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు
-
Politics News
AP High court: ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి
-
Business News
GST: రాష్ట్రాలకు పరిహారం కొనసాగింపుపై తేలని నిర్ణయం
-
Politics News
Maharashtra: గోవాకు రెబల్ ఎమ్మెల్యేలు.. సుప్రీంలో మొదలైన విచారణ.. ఠాక్రే కేబినెట్ భేటీ
-
Sports News
అప్పట్లో టీమ్ఇండియాపై సూపర్ ఓపెనింగ్ స్పెల్.. ట్రోలింగ్‌కు గురైన పాక్ మాజీ పేసర్!
-
General News
Telangana News: డిగ్రీ ప్రవేశాల కోసం.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా