Andhra News: నా సస్పెన్షన్‌ ముగిసింది.. పూర్తి జీతం ఇవ్వండి: ఏబీ వెంకటేశ్వరరావు

తనను ఇంకా సస్పెన్షన్‌లో కొనసాగించే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి

Updated : 25 Mar 2022 12:18 IST

అమరావతి: తనను ఇంకా సస్పెన్షన్‌లో కొనసాగించే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మకు ఆయన లేఖ రాశారు. రెండేళ్లు పూర్తయినందున సస్పెన్షన్‌ తొలగిపోయినట్లేని పేర్కొన్నారు.

సస్పెన్షన్‌ ఆరేసి నెలల చొప్పున పొడిగింపు జనవరి 27తో ముగిసిందని.. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌కు కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి అని లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గడువులోపు కేంద్రహోంశాఖ నుంచి అనుమతి తీసుకోనందున అది ముగిసినట్లేనని చెప్పారు. సస్పెన్షన్‌ తొలగినందున సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం తనకు పూర్తి జీతం ఇవ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని