Published : 29 May 2022 01:31 IST

Artificial knees: మోకాలికి కృత్రిమ కీళ్లతో సానుకూలం

ఇంటర్నెట్‌ డెస్క్‌: వృద్ధాప్యం ఒక్కటే కాదు..ప్రమాదం జరిగినా, అనుకోని వ్యాధులు వచ్చినా మోకీలు సమస్య ఎదురవుతుంది. కొన్నిసార్లు మందులతో తగ్గినా, కొన్నిసార్లు మోకీలు మార్పిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మోకీలు మార్పిడికి గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో మోకీలు కృత్రిమంగా అమర్చడానికి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. కృత్రిమ కీళ్లతో సానుకూలత, ఇబ్బందులు, మన్నిక గురించి జాయింట్‌ నీ రిప్లేస్‌మెంట్‌ సర్జన్‌ నీలం వెంకటరమణారెడ్డి పలు విషయాలు తెలిపారు.

కృత్రిమ కీళ్లలో మార్పు: గతంలో ఉన్న సాంకేతికతకు, ఇప్పటి సాంకేతికతకు చాలా వ్యత్యాసం ఉంది. అప్పట్లో రోగి కోలుకోవడానికి నెలలు పట్టేది. ఇప్పుడు వారాల్లో కోలుకుంటున్నారు. వీటి జీవితకాలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. యూకే, ఆస్ట్రేలియాలో వీటిపై పరిశోధన జరుగుతోంది. వాటిని మనం తీసుకొని ఇక్కడ ఆచరణలో పెట్టొచ్చు. మన దేశంలో గతంలో సిమెంట్‌తో తయారు చేసినవి వాడేవాళ్లం..ఇపుడు క్రాస్‌లిన్‌ ప్లాస్టిక్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందులో అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. వీటి జీవితకాలం చాలా ఎక్కువ. ఇండియాలోనూ పరికరాలు ఉత్పత్తి అవుతున్నా విదేశాల నుంచి తెచ్చిన వాటినే వాడుతున్నాం. 

అక్సీనియం కీలు ప్రత్యేకత: అక్సీనియం, గోల్గ్‌ ఇన్‌ప్లాంట్సు అంటే ఏమిటీ అని చాలా మంది అడుగుతుంటారు..రోగికి చర్మ సంబంధమైన సమస్యలున్నపుడు వీటిని వాడొచ్చు. గత 20 ఏళ్లుగా వీటిని వినియోగిస్తున్నాం. 

కూర్చొవచ్చా: కొత్తగా వచ్చిన కీళ్లతో  మోకీలును మడుచుకోవడానికి ఆస్కారం ఉంది. మెట్లు ఎక్కడానికి, కార్లోకి వెళ్లి కూర్చొవడానికి అవకాశం కలుగుతుంది. పద్మాసనం వేయడంతో పాటు కింద కూర్చొవద్దు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా వాటి కాల వ్యవధి పెరుగుతుంది.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని