Published : 06 Jul 2022 02:04 IST

Goats milk: మేక పాలతో మేలెంతో తెలుసా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్ని పాల కంటే ఆవు పాలు శ్రేష్ఠమని చెప్పుకుంటాం. ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే ఆవు పాల కన్నా మేక పాలు ఎంతో మేలని నిపుణులు పేర్కొంటున్నారు. పలు పరిశోధనల్లోనూ మేక పాలు పిల్లలకు చాలా మంచిదని తేల్చారు.

🐐 మేక పాలు చాలా త్వరగా జీర్ణం అవుతాయి. పొట్టలో గ్యాస్‌, ఉబ్బరం ఉండదు. ఆవు పాలలో క్యాసిమ్‌ అనే మిల్క్‌ ప్రోటీన్‌ ఉంటుంది. ఇది కొంతమంది పిల్లలకు ఎలర్జీని తెస్తుంది.

🐐  మేక పాలలో క్యాసిమ్‌ మోతాదు చాలా తక్కువగా ఉంటుంది. పాలు బాగా పలచగా ఉండటంతో పిల్లలకు ఎలర్జీలు రావు.

🐐మేక పాలలో లాక్టోషుగర్‌ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో పాలు పడకపోవడం లాంటి సమస్యలుండవు.

🐐 ఈ పాలలో విటమిన్‌ ఎ, దండిగా బి కాంప్లెక్సు, కాల్షియం, పాస్సరస్‌ ఉంటాయి. ఇది తేలికగా శరీరంలోకి వెళ్లిపోతాయి. 

🐐 ఆవు పాలతో పోలిస్తే మేకపాలలో విశృంఖల కణాలు చాలా తక్కువగా ఉత్పత్తి అవుతాయి. నిత్యం మేకపాలు తాగే వారిలో జీవక్రియల రేటు అధికంగా ఉంటుంది. కొవ్వుశాతం తక్కువ. వీటికి గాయాలను మాన్పించే గుణం అధికంగా ఉంది. 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని