Health: ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నారా? అయితే సెల్‌ఫోన్‌ ఎల్బో వస్తుంది జాగ్రత్త!

పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ చేతిలోనే ఉంటే పరికరం ఏదైనా ఉంది అంటే సెల్‌ఫోన్‌ అని చెప్పవచ్చు. సాధారణంగా సెల్‌ఫోన్‌తో వచ్చే సమస్యలు అంతా ఇంతా కాదు.

Published : 31 May 2022 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ చేతిలోనే ఉంటే పరికరం ఏదైనా ఉంది అంటే సెల్‌ఫోన్‌ అని చెప్పవచ్చు. సాధారణంగా సెల్‌ఫోన్‌తో వచ్చే సమస్యలు అంతా ఇంతా కాదు. సెల్‌ఫోన్‌ చేతిలో ఉంటే పక్కన ఉన్నవారితో అవసరమే ఉండదు. అసలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే పరిస్థితి లేదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా సెల్‌ఫోన్‌ వాడకం ఎక్కువగా ఉంటే వినికిడి సమస్య, కంటి సమస్యలు వస్తాయని తెలిసిందే! కానీ సెల్‌ఫోన్‌ ఎల్బో గురించి విన్నారా! నిజమేనండీ సెల్‌ఫోన్‌ ఎక్కువగా వాడుతుంటే సెల్‌ఫోన్‌ ఎల్బో వచ్చే ప్రమాదముంది.

సెల్‌ఫోన్‌ ఎల్బో అంటే ఏమిటి?

సెల్‌ఫోన్‌ మాట్లాడేటప్పుడు చేతిని మలుస్తూ ఉంటారు. ఎక్కువగా వాడినప్పుడు కూడా చేతిని ఒకే కోణంలో ఉంచుతుంటారు. దీని వల్ల మోచేయి దగ్గర ఉండే అల్నార్‌ నరం ఒత్తిడికి గురౌతుంది. దీంతో చేతికి తిమ్మిర్లు వస్తుంటాయి.

సెల్‌ఫోన్‌ ఎల్బో ఎలా వస్తుంది?

చేతిలో సెల్‌ఫోన్‌ను వాడుతుంటే ఈ పరిస్థితి వస్తుంది. మణికట్టు నుంచి మొదలు మోచేయి వరకూ నరం నొప్పి వస్తుంది. తిమ్మిర్లు వస్తాయి. దీని నుంచి తప్పించుకోవాలంటే ఫోన్‌ మాట్లాడేటప్పుడు ఎక్కువ సమయం ఒకే చేతితో పట్టుకోకూడదు. ఒకవేళ ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడాల్సి వస్తే హెడ్‌ఫోన్లు,బ్లూటూత్‌ వాడటం మంచిది. చేతులను ఒకే స్థితిలో ఉంచకూడదు.

ఈ సెల్‌ఫోన్‌ ఎల్బో ఎలా తగ్గుతుంది?

ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే చేతులనూ ఆడిస్తూ ఉండాలి. ఫోన్‌ ఎక్కువగా వాడకపోవడమే మంచిది. అత్యవసరమైన కాల్స్ మాత్రమే మాట్లాడేలా చూసుకుంటే ఉత్తమం. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. తగిన మందులు వాడి తగ్గించుకోవచ్చు.

అతి ఏదైనా చెడు ఫలితాలనిస్తుంది. అందుకే దేనినైనా మితంగా ఉపయోగించాలి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని