Urine test: మూత్ర పరీక్షలతో జబ్బుల గుట్టురట్టు

మూత్రం వ్యర్థ పదార్థమే అయినా అది ఎన్నో జబ్బుల ఆనవాళ్లను కనిపెట్టగలదు. దాని రంగుల ఆధారంగా మన శరీరంలోని ఎన్నో రుగ్మతల తీరుతెన్నులను బట్టబయలు చేయనుంది. చీము, రక్తం వెళితే తీవ్రమైన జబ్బులకు సంకేతంగా ఈ పరీక్ష చేస్తారు. రక్త, మూత్ర పరీక్షలతో జబ్బులను తేలికగా గుర్తించగలుగుతారు.

Published : 19 Aug 2022 11:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూత్రం వ్యర్థ పదార్థమే అయినా అది ఎన్నో జబ్బుల ఆనవాళ్లను కనిపెట్టగలదు. దాని రంగుల ఆధారంగా మన శరీరంలోని ఎన్నో రుగ్మతల తీరుతెన్నులను బట్టబయలు చేస్తుంది. చీము, రక్తం వెళితే తీవ్రమైన జబ్బులకు సంకేతంగా యూరిన్‌ పరీక్ష చేస్తారు. రక్త, మూత్ర పరీక్షలతో జబ్బులను తేలికగా గుర్తించగలుగుతారు. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం..!

* మూత్రం రంగు, ప్రోటీన్లు పోవడం, చీము కణాల ఆధారంగా అనేక ఆరోగ్య సమస్యలను వైద్యులు తెలుసుకుంటారు. 

* ప్రతి రోజు ఒక వ్యక్తి 1500 సీసీ నుంచి 2000సీసీ వరకు మూత్ర విసర్జన చేస్తారు. పగటి పూట ఎక్కువగా, రాత్రిపూట తక్కువగా మూత్రం పోయడం ఆరోగ్య లక్షణం.

* ఎక్కువ సార్లు, ఎక్కువ మొత్తంలో మూత్రం పోస్తే అతి మూత్ర వ్యాధిగా గుర్తిస్తారు. ఈ లక్షణంతో ప్రోటీన్లు కోల్పోతారని తెలుస్తుంది. రాత్రిపూట ఎక్కువసార్లు పోవాల్సి వస్తే మధుమేహం వచ్చినట్టు తెలుస్తుంది. 

* మూత్ర విసర్జన తక్కువగా ఉంటే డీహైడ్రేషన్‌తో పాటు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు ఉన్నాయని తెలుసుకోవచ్చు.

* మన శరీరంలో బ్యాక్టీరియా అధికంగా ఉంటే మూత్రం పోసినపుడు మంటగా ఉంటుంది. దీని ప్రభావం కిడ్నీలపై పడుతుంది.

* మూత్రం పసుపు రంగులో ఉంటే కామెర్లు సోకినట్టే.. ఎరువు రంగులో ఉంటే రక్తం పోతుందని అర్థం. కిడ్నీలో రాళ్లు వచ్చినా ఇలాగే ఉంటుంది. మలేరియా వస్తే నలుపు రంగులో వస్తుంది.

* గర్భధారణ వచ్చినపుడు మూత్ర పరీక్ష చేస్తే స్పష్టంగా తెలుస్తుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని