Dysphasia: ముద్ద మింగుడు పడటం లేదా..!

గాలి పీల్చడం, కనురెప్పలు కొట్టడం, మింగడం.. మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఈ పనుల్లో ఏదైనా తేడా వస్తే గందరగోళానికి గురవుతాం

Published : 27 May 2022 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాలి పీల్చడం, కనురెప్పలు కొట్టడం, మింగడం.. మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఈ పనుల్లో ఏదైనా తేడా వస్తే గందరగోళానికి గురవుతాం...ఆందోళన చెందుతాం. అప్పటి దాకా బాగా ఉన్నట్టు కనిపించినా తేడా రాగానే నాకేదో అయ్యిందే అనే భావన వెంటాడుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మింగడం కష్టంగా మారుతుంది. నీళ్లు, అన్నం తినడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వెంటనే వైద్యుల దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ఈఎన్‌టీ వైద్యులు శ్రీనివాస్‌ కిషోర్‌ సూచిస్తున్నారు. ఇలా మింగలేకపోవడాన్ని డిస్‌ఫేజియా అంటారని పేర్కొన్నారు.

వృద్ధాప్యంలోనే రాక: మింగలేకపోయే సమస్య ఎక్కువగా వృద్ధాప్యంలోనే వస్తుంది. నరాలు, కండరాలు బలహీనంగా తయారు కావడంతో ఇబ్బందులు వస్తాయి. లరింగో ఫెరింగో పరీక్షతో గొంతులో అడ్డుగా ఏమైనా ఉన్నాయో తెలుసుకుంటాం. స్వర పేటిక కదలికలను కూడా చూస్తాం. ఏదైనా మింగినపుడు స్వరపేటిక పైకి పోవాలి. అలా పోకపోతే మింగుడు పడదు. 

ఈ పరక్షలో: మనిషి గొంతులో సమస్యను తెలుసుకోవడానికి ద్రవాన్ని ఇచ్చి తాగుతున్నపుడు ఎక్స్‌రే తీస్తాం. ఎక్కడ సమస్య ఉందో స్పష్టంగా తెలుస్తుంది. 

చికిత్స ఎలా: సమస్య తీవ్రతను తెలుసుకున్న తర్వాత చికిత్స ప్రారంభించాలి. కొన్నిసార్లు క్యాన్సరు కూడా కావొచ్చు. తొందరగా గుర్తించినట్లయితే చికిత్స సత్వరం అందించడానికి వీలుంది. క్యాన్సర్‌ కాకపోతే మందులు, ఇతరత్రా పద్ధతులతో చికిత్స చేస్తాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని