Health News: కాలేయానికి కొవ్వుతో ముప్పు
మన శరీరంలో పెద్దన్న పాత్ర పోషించే కాలేయం చుట్టూ కొవ్వు పేరుకొని పోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్: మన శరీరంలో పెద్దన్న పాత్ర పోషించే కాలేయం చుట్టూ కొవ్వు పేరుకొని పోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. కాలేయానికి కొవ్వు అధికంగా పడితే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే. కాలేయానికి కొవ్వు పట్టినప్పుడు వచ్చే సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు విమలాకర్‌రెడ్డి ఇలా వివరించారు.
ముప్పు ఇలా: కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం, చక్కెర అధిక వినియోగంతో కొవ్వు కణాలు పెరుగుతాయి. చర్మంలోకి చేరితే పెద్దగా ప్రమాదం లేదు. అదే శరీరంలోని భాగాలకు చేరితోనే ముప్పు ఏర్పడుతుంది. గాడి తప్పిన తిండితో కొవ్వు పొరలు పొరలుగా కాలేయంలోకి చేరుతోంది. కాలేయంలో అసలే కొవ్వు ఉండదని కాదు..5శాతానికి మించి ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. దీనికి లక్షణాలు కనిపించవు. లివర్ పాడయ్యే స్థితికి వచ్చినపుడు కామెర్లు, కాళ్లలో నీరు చేరడం, రక్తవాంతులు. మలం నల్లగా ఉండటం, మతిమరుపు, కోమాలోకి వెళ్లడం, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె పాడవుతుంది.
దశలవారీగా: మొదట కాలేయ కణాల మధ్య కొవ్వు పేరుకొని పోతుంది. రెండోదశలో కొవ్వుశాతం పెరగడంతో పాటు కాలేయం దెబ్బతింటుంది. చివరి దశలో కొవ్వు కణాలు కాలేయాన్ని పూర్తిగా కప్పేస్తాయి. కాలేయం తన స్వరూపం కోల్పోయి సిమెంటు ముద్దలాగా మారిపోతుంది. దీంతో పొట్టలో బరువుగా అనిపిస్తుంది. ఆకలి తగ్గిపోతుంది. పొట్టపై భాగంలో నొప్పిగా ఉంటుంది. కాళ్లలో నీరు చేరడంతో పాటు కామెర్లు వస్తాయి.
ఎలా పసిగట్టవచ్చు:ఫ్యాటీ లివర్‌ను గుర్తించడానికి ఆల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్, సిటీస్కాన్, ఎంఆర్ఐ, లివర్ ఫంక్షన్, లివర్ బయాప్సీ పరీక్షలతో వైద్యులు నిర్ధారిస్తారు. మొదటి రెండు దశల్లో ఉన్నపుడే వ్యాయామం చేయడం, అవసరమైన మందులను వాడితే సమస్యను నివారించవచ్చు. కాలేయం 70 శాతం పాడైనా మందులతో బాగు చేయడానికి వీలుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్‌లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!