Gullionbarry: ఒంట్లో ఓపిక లేదా..? ఎందుకో తెలుసా..!

ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంది. బలం పుంజుకోవడానికి టానిక్‌లు

Updated : 24 Sep 2022 12:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంది. బలం పుంజుకోవడానికి టానిక్‌లు, మందులు వాడుతుంటాం. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు నీరసం అసలు తగ్గదు. కాళ్లు, చేతులు లాగుతాయి. తిమ్మిర్లు పడుతాయి. కండరాలు కూడా పక్షవాతం వచ్చినట్టు చచ్చుబడిపోతాయి. ఈ పరిస్థితికి గల కారణాలు, ఎలాంటి వైద్యం చేయాలో న్యూరాలజిస్టు డాక్టర్‌ రాజేశ్వరి వివరించారు.

ఇది నరాల జబ్బేనా..?

ఈ సమస్య చాలా అరుదుగా వస్తుంది. దీన్ని గిలియన్‌బారీ సిండ్రోమ్‌గా పిలుస్తాం. నరాల ప్రోటీన్లపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది. దీంతో మైలిన్‌ పూత పాడవుతుంది. మెదడుకు సంకేతాలు వెళ్లకపోవడంతో సమస్య తీవ్రంగా ఉంటుంది. తిమ్మిర్లు వస్తాయి. బాగా నీరసంగా అనిపిస్తుంది. నడవడం కూడా చేతకాదు. చేతుల్లో బలం లేకుండా పోతుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇవన్నీ గిలియన్‌ బారీ సిండ్రోమ్ లక్షణాలే.

చికిత్స ఇలా...!

ప్లాస్మాను మార్చడం, లేదా ఇతరుల నుంచి ఆరోగ్యకరమైన యాంటీబాడీస్‌ సేకరించి ఇవ్వొచ్చు. ఈ రెండు విధానాలు ఒకే విధంగా ఉంటాయి. రోగి స్పందన ఆధారంగా చికిత్స అందిస్తారు. నాలుగు వారాల పాటు చికిత్స, పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీతో కూడా చికిత్స చేయవచ్చు. కాకపోతే లక్షణాలు కనిపించగానే చికిత్స అందించడం ఉత్తమం.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని