Health: బట్టతలపై వెంట్రుకలు కావాలా నాయనా..!

బట్టతల యువతరంపై పిడుగుపాటు. అప్పుడే వృద్ధాప్యం వచ్చినట్టు ఆందోళన చెందుతారు. ఆహారపు అలవాట్లు, విపరీతమైర కాలుష్యం, మానసిక ఆందోళనలు బట్టతలను తొందరగా తెచ్చిపెడుతాయి. 

Updated : 10 Aug 2022 11:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బట్టతల యువతరంపై పిడుగుపాటు. అప్పుడే వృద్ధాప్యం వచ్చినట్టు ఆందోళన చెందుతారు. ఆహారపు అలవాట్లు, విపరీతమైర కాలుష్యం, మానసిక ఆందోళనలు బట్టతలను తొందరగా తెచ్చిపెడుతాయి. వెంట్రుకలు తలపై ఊడి పోకుండా రకరకాల మందులు, ప్రయత్నాలు చేస్తారు.. కానీ వంశపారంపర్యంగా వచ్చే సమస్యల్లో బట్టతల ఒకటని గుర్తు పెట్టుకోవాలి. ప్రచార ప్రకటనలలోని అంశాలను నమ్మి నూనెలు, మందులు, ఇంజక్షన్లు వాడినంత మాత్రాన జట్టు రాదు. కేవలం తలపై జట్టును మళ్లీ నాటడం ఒక్కటే పరిష్కారమని చర్మవ్యాధుల వైద్య నిపుణుడు సందీప్‌ పేర్కొంటున్నారు.

కారణం: బట్టతల రావడానికి పురుష హార్మోన్‌ అయిన టెస్టోస్టిరాన్‌ జన్యు పరమైన కారణాలతో తలపై చర్మంలో డీ హైడ్రో టెస్టోస్టిరాన్‌గా మారిపోవడంతో వేగంగా వెంట్రుకలు ఊడిపోతాయి. యుక్త వయస్సులో టెస్టోస్టిరాన్‌ పెరుగుతున్న దశ నుంచే వెంట్రుకలు రాలిపోవడం మొదలవుతాయి. 

ఒకసారి వస్తే...: 30 ఏళ్ల తర్వాత జెనెటిక్‌, హార్మోన్ల ప్రభావంతో వెంట్రుకలు రాలిపోతాయి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలతో బట్టతల తొందరగా రాకుండా కాపాడుకోవచ్చు. మందులు, పీఆర్పీ ఇంజక్షన్లు, లైట్‌ థెరపీతో జట్టు రాలకుండా చూసుకోవచ్చు. ఒకసారి బట్టతల వస్తే ఏ ప్రయత్నం చేసినా జట్టును తేలేం. బట్టతల మగవారికే కాదు.. ఆడవారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 

హెయిర్‌ ట్రాన్సుప్లాంటేషన్‌: హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ రెండు రకాలు. ఒకరకంలో తల వెనకున్న చర్మంతో పాటే వెంట్రుకలను తీసుకొని ఒక్కొక్క వెంట్రుకను విడగొట్టాలి. మనకు కావాల్సిన చోట నాటుతారు. అయితే కొన్ని సమస్యలు వస్తుండటంతో ఈ పద్ధతిని ప్రస్తుతం వాడటం లేదు. రెండో పద్ధతిలో వెంట్రుకలను తీసుకొని కావాల్సిన చోట నాటడం. మూడు నాలుగు రోజుల్లో సాధారణ స్థితికి వచ్చేస్తాం. మూడు నెలల తర్వాత వైద్యులు ఇచ్చే మందులతో జుట్టు మందంగా వస్తుంది.మరిన్ని వివరాలు కింది వీడియోలో చూసేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని