Published : 26 Jun 2022 01:26 IST

Health: తరచుగా జబ్బుల బారిన పడుతున్నారా..? కాలేయం ఎలా ఉందో తెలుసుకోండి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలేయం ఊరికే దెబ్బతినదు..దానికెన్నో కారణాలుంటాయి. ఆహార నియమాలు పాటించకపోవడం, ఆల్కహాల్‌, పొగ విపరీతంగా తాగడంతో అనర్థాలను తెచ్చుకుంటారు. తరచుగా జబ్బులతో కాలేయం దెబ్బతింటున్నట్టు సంకేతాలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. ఏవో కొన్ని రకాల మందులను కొని వేసుకుంటారు. కానీ కాలేయం పరీక్ష చేయించుకుంటే సమస్య ఏ స్థాయిలో ఉంది..? ఎందుకు కాలేయం దెబ్బతిందో తెలిసిపోనుంది. ఈ పరీక్ష గురించి వైద్యులు పలు సూచనలు చేశారు.

కాలేయం కీలకం

శరీరంలోనే అతి పెద్ద అవయవం కాలేయం. .దాదాపుగా 500 రకాలకుపైగా విధులను నిర్వహిస్తుంది. ఆహారంలోని కొవ్వులను వేరు చేసి శక్తిగా మారుస్తుంది. జీర్ణశక్తికి అవసరమైన పైత్య రసాన్ని నిరంతరం స్రవిస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్‌ కణాల నుంచి శరీరానికి అవసరమైన ఇనుమును తయారు చేస్తుంది. శరీరంలో విడుదలయ్యే హానికరమైన విషతుల్యాలను వేరు చేస్తూ మనకు రక్షణ కవచంలా పని చేస్తుంది. 

కారణాలు ఇవే..గమనించండి

ఎంతో కీలకమైన కాలేయానికి హెపటైటీస్‌ ఇన్‌ఫెక్షన్లు, మద్యం, కొవ్వుపదార్థాలు, నిత్యం మనం మింగే మందులు కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయి. కాలేయానికి వచ్చే సమస్యల ఆనవాళ్లను గుర్తించేందుకు లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ ఎంతో ఉపకరిస్తుంది. రక్తంలో స్రవించిన ఎంజైమ్‌లు, ప్రోటీన్లు, బైలూరూబీన్‌ రసాయనాల శాతాల ఆధారంగా కాలేయం ఆరోగ్యాన్ని, కాలేయ వ్యాధుల తీరు తెన్నులను వైద్యులు అంచనా వేస్తారు. కామెర్లు కావడం, రక్తం తొందరగా గడ్డ కట్టకపోయినా లివర్‌ సమస్య ఉందని గమనించాలి.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని