Longevity Diet : ఇలా తినండి.. ఆయుష్షు పెంచుకోండి

మనం ఏ పనైనా చేయడానికి శక్తి కావాలి...ఆరోగ్యంగా ఉండాలన్నా పౌష్టికాహారం తప్పనిసరి. విటమిన్లు, ప్రోటీన్లు, మాంసకృతులుండాలని వైద్యులు చెబుతారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు పలు రకాల ఆరోగ్య సూచీలను ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు లాంటి వ్యాధులకు దూరంగా, గుండెపోటు రాకుండా ఉండేలా చేయడంతో పాటు దీర్ఘాయుష్షు పొందేలా కొత్త రకం ఆహార నియమావళి అమలు చేస్తున్నారు.

Published : 08 Oct 2022 00:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం ఏ పనైనా చేయడానికి శక్తి కావాలి...ఆరోగ్యంగా ఉండాలన్నా పౌష్టికాహారం తప్పనిసరి. విటమిన్లు, ప్రోటీన్లు, మాంసకృతులుండాలని వైద్యులు చెబుతారు. సంపూర్ణ ఆరోగ్యం ఉండేందుకు పలు రకాల ఆరోగ్య సూచీలను ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు లాంటి వ్యాధులకు దూరంగా, గుండెపోటు రాకుండా ఉండేలా చేయడంతో పాటు దీర్ఘాయుష్షు పొందేలా కొత్త రకం ఆహార నియమావళి అమలు చేస్తున్నారు. దీన్నే లాంజివిటీగా పిలుస్తున్నారు. ఇందులో ఏం ఉండాలంటే...!

* ఏం తింటున్నాం.. ఎలా తింటున్నాం.. అనే దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అంతేకాదు మన ఆయుష్షు కూడా దీనికి ముడిపడి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

* దీర్ఘకాలం జీవించి ఉన్న ప్రజలను పరిశీలించినప్పుడు వారి చక్కని ఆహారపు అలవాట్లే కారణమని తెలిసింది.

* ఆకుకూరలు. ఫలాలు, బీన్స్‌, బాదం. ఆలీవ్‌ నూనె,  మొక్కల నుంచి వచ్చే విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్‌ ఉండే ఆహారం తీసుకోవాలి.

* మాంసం, పాల ఉత్పత్తులను ఎక్కువగా తినకూడదు. కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవద్దు. 

* పాల పదార్థాలకు దూరంగా ఉండలేని వారు ఆవు, మేక, గొర్రెపాలు తీసుకోవచ్చు.

* నిర్దిష్ట సమయం ఉపవాసం ఉండటం అవసరం. మనం తినే ఆహారం12 గంటల వ్యవధిలోనే తినాలి. నిద్రించడానికి మూడు, నాలుగు గంటల ముందు ఏమీ తినకూడదు. 

*  వారంలో రెండు రోజులు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడంతో గ్లూకోజ్‌ స్థాయిలు సరిగా ఉంటాయి. 

* ఇలా తినడంతో మధుమేహం, ఊబకాయం, గుండెజబ్బుల ముప్పు తప్పుతుందని పరిశోధకులు తెలిపారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని