Mayocarditis: గుండె కండరం వాచినా కష్టాలే సుమా..!

కొంతమందికి చీమ కుట్టినపుడు వచ్చిన వాపు లాగే గుండె కండరాలకు కూడా వస్తుంది. ఇలాంటి సందర్భంలో గుండె పనితీరు చాలా మందగిస్తుంది.

Published : 04 Jul 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంతమందికి చీమ కుట్టినప్పుడు వచ్చిన వాపు లాగే గుండె కండరాలకు కూడా వస్తుంది. ఇలాంటి సందర్భంలో గుండె పనితీరు చాలా మందగిస్తుంది. గుండె నుంచి తగినంత రక్త సరఫరా జరగదు. చివరికి గుండె బలహీన పడి హార్ట్‌ ఫెయిల్‌కు దారి తీస్తుంది. ఈ పరిస్థితిని వైద్యులు మయోకార్డిటైస్‌గా చెబుతారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టు దామోదర్‌ పలు సూచనలు చేశారు.

హార్ట్‌ అటాక్‌ ఎందుకు వస్తుంది

గుండె కండరాలకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు హార్ట్‌ అటాక్‌ వస్తుంది. గుండె కండరాలకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అదే మయోకార్డిటైస్‌. వైరస్‌, బ్యాక్టీరియాతో పాటు ఇతర కారణాలతో ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. వాపుతో గుండె పనితీరులో మార్పు వస్తుంది. హార్ట్‌బీట్‌ 200,300లకు కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు నిమిషానికి 40సార్లే కొట్టుకోవచ్చు. ఈ సమయంలో కార్డియాక్‌ అరెస్ట్‌ కూడా అవుతుంది. రోగిని పరిశీలించిన తర్వాత ఈసీజీ చేస్తాం. ఎకో కార్డియోగ్రాం చేసిన తర్వాత పరిస్థితిని పూర్తిస్థాయిలో అంచనా వేయడానికి వీలవుతుంది. 

చికిత్స ఎలా ఉంటుందో..

గుండె కండరాలకు వాపు వచ్చిన వారు తప్పనిసరిగా ఆసుపత్రిలో చేరాలి. హార్ట్‌ ఫెయిల్యూర్‌ చికిత్స అందించాల్సి వస్తుంది. గుండెను సాధారణ స్థితికి తీసుకొచ్చేదాకా ఇంజిక్షన్లు, మందులు ఇస్తారు. అయినా కూడా రోగి నుంచి స్పందన సరిగా లేకపోతే కొన్ని యంత్రాలను వినియోగించాల్సి వస్తుంది. అయినా కూడా గుండె పనితీరు మెరుగు పడకపోతే వాళ్లకు హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కూడా ఆలోచించాల్సి వస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని