Menstrual: నెలసరి లెక్క తప్పుతోందా...! ఎందుకో తెలుసా..?

కొంతమంది మహిళల్లో రుతుచక్రం గాడి తప్పుతోంది. లెక్కాపత్రం లేకుండా రుతుస్రావం కావడంతో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. ఆరోగ్య సమస్యలు, హార్మోన్ల అసమతుల్యంతో పాటు వంశపారంపర్యంగా కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. రుతుచక్రంలో కొంతమందికి ఏడు రోజులు కావడం, మరికొంతమందికి ముద్దలు పడుతున్నాయని చెబుతున్నారు.

Updated : 23 Nov 2022 11:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంతమంది మహిళల్లో రుతుచక్రం గాడి తప్పుతోంది.రుతుస్రావం కావడంలో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. ఆరోగ్య సమస్యలు, హార్మోన్ల అసమతుల్యంతో పాటు వంశపారంపర్యంగా కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. రుతుచక్రంలో కొంతమందికి ఏడు రోజులు కావడం, మరికొంతమందికి ముద్దలు పడుతున్నాయని చెబుతున్నారు. వాటర్‌లాగా కాకుండా ఏ మాత్రం అనుమానం ఉన్నా వైద్యులను కలుసుకోవాలని గైనకాలజిస్టు డాక్టర్‌ సువర్ణరాయ్‌ సూచించారు.

సాధారణ స్థితి ఎలా...?

మహిళలకు సాధారణంగా 28 నుంచి 30 రోజుల మధ్యలో రుతుచక్రం మొదలవుతుంది. కొంతమందికి ఎక్కువగా రుతుస్రావం అవుతుందని అంటారు. ఏడు రోజుల కంటే అధికంగా అవుతున్నపుడే దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. గడ్డలు పడటం మంచిది కాదు. ఇలాంటి వారిలో హిమోగ్లోబిన్‌ తగ్గిపోతుంది. 21 రోజుల కంటే తొందరగా రావడం సరికాదు. నెలరోజులు దాటడం, రెండ్రోజుల కంటే తక్కువగా స్రావం అవుతున్న అనుమానించాల్సిందే. వీళ్లు కచ్చితంగా వైద్యులను కలుసుకోవాలి.

అధిక రక్తస్రావం ఎప్పుడంటే..

థైరాయిడ్‌ ఉన్నపుడు, జ్వరం, లివర్‌, కిడ్నీలలో సమస్యలున్నా, గర్భసంచిలో పైబ్రాయిడ్స్‌ ఉన్నా కూడా అధిక రక్తస్రావం అవుతుంది. ప్రాథమికంగా తగ్గడానికి మందులు ఇస్తాం. హార్మోన్లకు మందులు ఇవ్వనున్నాం. పైబ్రాయిడ్స్‌ ఉంటే లాప్రోస్కోపీతో గడ్డలను తీసేస్తాం. 

నెలసరి సరిగా రాకపోతే...

థైరాయిడ్‌ ఎక్కువగా ఉన్న వారికి నెలసరి సరిగా రాదు. పీసీఓడీ ఉన్నా కూడా రుతుచక్రం అస్తవ్యస్తంగా ఉంటుంది. రక్తస్రావం కొంచమే అవుతుంది. జీవనశైలి మార్చుకోవాలి. వ్యాయామం చేయాలి. మానసిక సమస్యలు లేకుండా చూసుకోవాలి.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts