Cardiac Surgeries: పెద్ద కోతల్లేకుండానే గుండెకు సర్జరీ..! ఎలాగో తెలుసా..?

ఛాతీ తెరవకుండానే గుండె సమస్యలకు సంబంధించిన శస్త్రచికిత్సలను చేయడానికి అవకాశం ఉంది. 5 సెం.మీటర్ల కోత పెట్టి సర్జరీ చేస్తున్నారు. దీంతో రక్తస్రావం ఉండదు.

Published : 30 Oct 2022 01:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుండెకు ఆపరేషన్‌ అంటే ఛాతీని తెరవాల్సి వచ్చేది.. ఈ సమయంలో రక్తం కూడా ఎక్కువగానే పోతుంది. ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిందే. ఇటీవల చిన్న చిన్న రంధ్రాలను చేసి గుండెకు చికిత్స చేస్తున్నారు. దీన్నే మినిమల్లీ ఇన్‌వాసివ్‌ కార్డియాక్‌ సర్జరీ అంటారని ప్రముఖ కార్డియా ధోరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సుధీర్‌ పేర్కొన్నారు. గతంలో చేసిన శస్త్రచికిత్సలతో సమయం, వ్యయం, రక్తం ఎక్కువగా వృథా అయ్యేదని తెలిపారు.

చిన్న రంధ్రాలతోనే సరి

ఛాతీ తెరవకుండానే గుండె సమస్యలకు సంబంధించిన శస్త్రచికిత్సలను చేయడానికి అవకాశం ఉంది. 5 సెం.మీటర్ల కోత పెట్టి సర్జరీ చేస్తున్నారు. దీంతో రక్తస్రావం ఉండదు. నొప్పి తక్కువ. ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. రోగి తొందరగా కోలుకొని ఇంటికి వెళ్లి సొంతంగా పనులు చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని