Published : 25 May 2022 01:54 IST

Health: పెద్ద కోతల్లేకుండానే వెన్నుకు శస్త్రచికిత్స

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెన్నెముకకు ఆపరేషన్‌ అనగానే వణికిపోతారు. ఇప్పటికీ చాలా మందికి భయమే. సాధారణ జీవితం కష్టంగా ఉంటుందనే ఆందోళనతో మందులతోనే చాలామంది నెట్టుకొస్తున్నారు. కానీ ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడంతో వెన్నుకు శస్త్రచికిత్స చిన్న రంధ్రాలతోనే అయిపోతోంది. దాన్నే మినిమల్లీ ఇన్వెజివ్‌ అంటారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మార్పు వచ్చింది.  దీని గురించి న్యూరో సర్జన్‌ రంగనాథం వివరించారు.

ఎలాగంటే: ఒకప్పుడు ఆపరేషన్‌ అంటే పది, పదిహేను కుట్లు, కొంతమంది వైద్యులు, భారీ హంగామా ఉండేది. ఇపుడు చిన్న రెండు రంథ్రాలు చేసి బ్రెయిన్‌, వెన్నెముకకు ఆపరేషన్‌ చేసే సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. రోగికి ఎలాంటి ఇబ్బందులుండవు. సాధ్యమైనంత తొందరగానే ఇంటికి వెళ్లిపోవచ్చు. రక్తస్రావం ఉండదు. నొప్పి తక్కువ. మెదడుకు, రక్తనాళాలకు ఇబ్బంది కలగకుండా ఎండోస్కోపీతో చేయగలుగుతున్నాం. 

ప్రయోజనం ఎక్కువ: పెద్ద ఆపరేషన్‌ చేసే అవకాశాలు చాలా తగ్గిపోయాయి. వెన్నెముక ఆపరేషన్‌ చేస్తే రక్తస్రావంతో ఎక్కువ రక్తం ఎక్కించాల్సి వచ్చేది. మత్తు మందు ఇచ్చే నిపుణులు అందుబాటులో ఉండాల్సి వచ్చేది. చాలా సమయం తీసుకునేది. ఇపుడు హడావుడి తగ్గింది ఎంత సీరియస్‌ రోగికైనా ఎండోస్కోపీతో చక్కగా ఆపరేషన్‌ చేయగలుగుతున్నాం. సైడ్‌అపెక్ట్‌లు కూడా బాగా తగ్గిపోయాయి. ఐదు గంటలకు పైగా అయ్యే సమయం కాస్త రెండు గంటలకు తగ్గిపోయింది.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని