Health: రేడియోథెరపీ క్యాన్సర్‌ రోగులకు వరం

క్యాన్సర్‌ నివారణకు రేడియేషన్‌ ఎంతో కీలకం. క్యాన్సర్‌ కణంపై రేడియో థార్మిక కిరణాలను ప్రసరింపజేసి దాన్ని సమూలంగా నాశనం చేస్తారు. 

Updated : 10 Aug 2022 11:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్యాన్సర్‌ నివారణకు రేడియేషన్‌ ఎంతో కీలకం. క్యాన్సర్‌ కణంపై రేడియో థార్మిక కిరణాలను ప్రసరింపజేసి దాన్ని సమూలంగా నాశనం చేస్తారు. పక్కనే ఉండే ఆరోగ్యకరమైన కణజాలం కూడా దెబ్బతినే ముప్పు ఉంటుంది. ఈ ముప్పును తప్పించడానికి ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేడియేషన్‌ థెరపీ గురించి రేడియేషన్‌ అంకాలజిస్టు ప్రశాంత్‌ వివరించారు.

ఎలా పని చేస్తుంది: ఉదయం సూర్యుడి నుంచి వచ్చే కిరణాలే రేడియేషన్‌. దీనికే ఎక్కువ  శక్తి కలిగించినపుడు ఎక్స్‌రే అంటాం. మనం దీన్ని వెలుగులాగా చూడలేం..శరీరం గ్రహించదు. ఈ కిరణాలతోనే ఎక్స్‌రే, సిటీస్కాన్‌, పెట్‌స్కాన్‌ చేయగలుగుతాం. ఎక్స్‌రే కిరణాలకు శక్తిని ఎక్కువగా ఇచ్చి క్యాన్సర్‌ కణాలపై ప్రయోగించినట్లయితే వాటిని క్షీణింపచేయవచ్చు.

ఎక్స్‌ టెర్నల్‌ బీమ్‌ రేడియేషన్‌: ఎక్స్‌రే కిరణాలను బయట ఒక మిషన్‌లో ఉత్పత్తి చేసి వాటిపై రోగిని పడుకోబెట్టి క్యాన్సర్‌ కణాలను నశింపజేసే పద్ధతి ఇది. దాదాపుగా 90శాతం రోగులకు ఈ విధానంలో చికిత్స చేస్తున్నాం.

బ్రాకీ థెరపీ: రేడియో యాక్టివ్‌ గుళికలు ఎక్స్‌రే కిరణాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ గుళికలను క్యాన్సర్‌ కణాల్లో పెట్టి అక్కడే ఎక్స్‌రేలను ఉత్పత్తి చేసి క్యాన్సర్‌ కణతులను ధ్వంసం చేస్తాం. ఇపుడు 10శాతం రోగులకు మాత్రమే దీన్ని వాడుతున్నాం. ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు దీన్ని వాడుతున్నాం. 

ఇది కొత్త విధానం: అణువులో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రన్సు ఉంటాయి. అందులో ప్రోటాన్‌ను తీసుకొని దానితో రేడియేషన్‌ వైద్యం చేయడం కొత్తగా వచ్చింది. కేవలం క్యాన్సర్‌ కణాలకు కాకుండా ఇతర కణాలకు ఈ రేడియేషన్‌ వెళ్లదు. 

సురక్షితమా: ఏ వైద్యం చేసినా కొన్ని దుష్పరిమాణాలు ఉంటాయి. రేడియేషన్‌ థెరపీలో ఏ అవయవానికి చికిత్స చేస్తున్నామో దాని ప్రకారమే ఇబ్బందులుంటాయి. గొంతు, నోరు భాగంలో ఇస్తుంటే నోరు పొడిబారిపోవడం, గొంతు తడారుతుంది. దేన్ని మింగనీయదు. నోటిలో పుండ్లు ఏర్పడుతాయి. చర్మంపై ఇస్తే దురద, మంట ఉంటుంది. కడుపు భాగంలో చేస్తే ఆకలి వేయకపోవడం, అన్నం సహించదు. దుష్పప్రభాలన్నింటినీ సులువుగానే నయం చేయడానికి వీలుంది.

జాగ్రత్తలు ఇవీ: నోరు, గొంతు భాగంలో చికిత్స చేసే సమయంలో బ్రష్‌ చేయొద్దు. షేవింగ్‌, కటింగ్‌ చేసుకోకూడదు. అన్నం తిన్న ప్రతిసారి మౌత్‌వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని