Cardiac arrest: ఉన్నట్టుండి గుండె ఆగిపోతే ఎలా...:!

వ్యాయామం చేస్తున్నపుడో..మైదానంలో ఆటలు ఆడుతున్నపుడో ఉన్నట్టుండి కొంతమంది కుప్పకూలిపోతారు. 

Published : 21 May 2022 02:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాయామం చేస్తున్నప్పుడో.. మైదానంలో ఆటలు ఆడుతున్నప్పుడో ఉన్నట్టుండి కొంతమంది కుప్పకూలిపోతారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాతే ఏం జరిగిందో తెలుస్తుంది. చివరికి వైద్యులు సడెన్‌ కార్డియాక్‌ డెత్‌ అని చెబుతారు. అంతకు ముందు వరకూ బాగా పని చేసిన గుండె ఆగిపోవడానికి గల కారణాలు ఏవై ఉంటాయి..? ఎందుకిలా జరిగిందనే అనుమానం అందరిలోనూ వస్తుంది. ఇలా అకస్మాత్తుగా గుండె ఆగిపోవడానికి మద్యం, పొగ, కఠినమైన శ్రమ, స్టెరాయిడ్ల వాడకం లాంటి కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎందుకు వస్తుంది? రాకుండా ఉండేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇంటర్వేన్షనల్‌ కార్డియాలజిస్టు శ్రీధర్‌ కస్తూరి వివరించారు.

గుండె ఎందుకు ఆగిపోతుంది: ఉన్నట్టుండి గుండె ఒక్కసారిగా ఆగిపోవడాన్ని సడెన్‌ కార్డియాక్‌ అరెస్టుగా చెబుతాం. మేజర్‌ హార్ట్‌ అటాక్‌తో గుండెకు రక్తసరఫరా తగ్గిపోతుందో అప్పుడు షార్ట్‌ సర్క్యూట్‌లాగా పని చేసి సడెన్‌గా హార్ట్‌రేట్‌ 250-300కు వెళ్లిపోతుంది. ఆ సమయంలో హార్ట్‌ పంప్‌ చేయకుండా నిలువరిస్తుంది. కొంతమంది డీహైడ్రేడ్‌, గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్య ఉండటం, లూజ్‌ మోషన్లు బాగా కావడంతో పొటాషియం ఎక్కువ విడుదల అవుతుంది. ఆ సమయంలోనూ గుండె పని చేయక పోవచ్చు.

లక్షణాలు ఇవే: నీరసంగా ఉండటం, కళ్లు తిరగడం, ఛాతీ పట్టేయడం, గొంతు దగ్గర లాగినట్టు అనిపించడం, నాభిపైన అసిడిటీలాగా అనిపిస్తుంది. 

ఏం చేయాలి: సడెన్‌గా పడిపోయిన వారి గుండె కొట్టుకోకుండా ఉన్నప్పుడు వెంటనే నోటితో కృత్రిమ శ్వాస అందించాలి. హార్ట్‌ మసాజ్‌ చేయాలి. నాలుగుసార్లు శ్వాస ఇచ్చి ఒకసారి ఛాతీపై గట్టిగా ఒత్తాలి. ఇలా నాలుగైదు సార్లు చేయడంతో కొంతమంది మళ్లీ ఊపిరి తీసుకోవడానికి వీలుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని