మోసం చేసే వ్యాధులున్నాయని తెలుసా..? వాటితో జాగ్రత్త సుమా..!

మన కళ్లను మనమే నమ్మలేనట్టుగానే..కొన్ని వ్యాధులు ఇలా వచ్చి అలాపోతాయి..ఆ లక్షణాలు గుర్తు పట్టేలోపే సాధారణ స్థితికి వచ్చేస్తాం. అలాగని వదిలేశామనుకో..ఇక అవి మన అంతు చూసే దాకా వదలవు. అలాంటి జబ్బుల్లో ఒకటి తాత్కాలిక పక్షవాతం. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ మాయమవుతాయి. దీనికి సకాలంలో వైద్యం చేయించకపోతే తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Published : 08 Oct 2022 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని వ్యాధులు ఇలా వచ్చి అలాపోతాయి. ఆ లక్షణాలు గుర్తు పట్టేలోపే సాధారణ స్థితికి వచ్చేస్తాం. అలాగని వదిలేశామంటే.. ఇక అవి మన అంతు చూసే దాకా వదలవు. అలాంటి జబ్బుల్లో ఒకటి తాత్కాలిక పక్షవాతం. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ మాయమవుతాయి. దీనికి సకాలంలో వైద్యం చేయించకపోతే తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధితో చాలా అప్రమత్తంగా ఉండాలని న్యూరోఫిజిషియన్‌ డాక్టర్‌ సుబ్బయ్య చౌదరి వివరించారు.

ఇది బ్రెయిన్‌ స్ట్రోక్‌ లాంటిదే...

తాత్కాలిక పక్షవాతం లక్షణాలు పూర్తి స్థాయిలో ఉండవు. కాళ్లు చేతులు లాగడం, బలం తగ్గిపోవడం, ఒక కంటి చూపు తగ్గిపోవడం, మాటలో తేడాలుంటాయి. తల తిరుగుతున్నట్టు ఉంటుంది. నడక సరిగా ఉండదు. ఈ లక్షణాలు గంటలోపే తగ్గిపోతాయి. అలా అని తేలిగ్గా తీసుకోవద్దు. భవిష్యత్‌లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా సీరియస్‌గా తీసుకోవాలి. పక్షవాతం లక్షణాలు కనిపించిన వారు మధుమేహం, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. వ్యాయామం తప్పక చేయాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే ప్రమాదం తగ్గుతుంది.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts