
Balakrishna: సతీమణి వసుంధరతో వాడరేవు బీచ్‌లో బాలయ్య సందడి
కారంచేడు: సంక్రాంతి అంటే వెండితెరపై సందడి చేసే నందమూరి బాలకృష్ణ ఈసారి తన సోదరి పురందేశ్వరి ఇంట్లో వేడుక చేసుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రకాశం జిల్లా కారంచేడు వెళ్లిన ఆయన గత రెండు రోజులుగా అక్కడే సందడిగా గడుపుతున్నారు. బంధువులతో కలిసి చీరాలలోని వాడరేవు బీచ్‌కు వెళ్లి.. కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా గడిపారు. ఈ సందర్భంగా బాలయ్య తన సతీమణి వసుంధరను జీప్‌లో ఎక్కించుకొని సరదాగా బీచ్‌లో రైడింగ్ చేశారు. నిన్న పురందేశ్వరి నివాసంలో సరదాగా గుర్రమెక్కి బాలయ్య సందడి చేసిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.