AP News: చంద్రబాబు కార్యసాధకుడు.. అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు: సుమన్‌

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడు అని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ కొనియాడారు.

Updated : 29 Jun 2024 15:55 IST

తిరుచానూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడు అని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ కొనియాడారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోంది. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారు. గతంలో ఉద్యోగాలు లేకుండా యువత ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి పవన్ కల్యాణ్‌కు మంచి శాఖలనే కేటాయించారు. ఉపముఖ్యమంత్రిగా ఆయన తన సత్తా చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉంది. అలీ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం ఆయన వ్యక్తిగతం. అయితే సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కుతాయని అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రజా సేవ చేస్తే పదవులు వాటికవే వస్తాయి’’ అని సుమన్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని