Hyderabad: ‘నాపై కేసు కొట్టివేయండి’.. హైకోర్టులో నటి డింపుల్ హయాతి పిటిషన్
నటి డింపుల్ హయాతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో నటి డింపుల్ హయాతి పిటిషన్ దాఖలు చేశారు. ట్రాఫిక్ డీసీపీ ఒత్తిడితో తనపై తప్పుడు కేసు పెట్టారని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. డింపుల్ హయాతికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. సీఆర్‌పీసీ 41ఏ నిబంధనల మేరకే వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. కాగా.. ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి చేశారన్న కారణంతో ఆయన డ్రైవర్ చేతన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయాతి, డేవిడ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Cricket News: అనుష్కను ఆటపట్టించిన విరాట్.. వరల్డ్‌కప్ జట్టులో చాహల్ ఉంటే బాగుండేదన్న యువీ!
-
Nalgonda: తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. పెట్టెలో రూ.2 కోట్ల నగదు
-
Chandrababu Arrest: అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష: అచ్చెన్న
-
Cyber investment fraud: రోజుకు రూ.5వేల లాభమంటూ ఆశజూపి.. రూ.854కోట్ల ఘరానా మోసం
-
Vishal: ప్రధాని మోదీకి విశాల్ కృతజ్ఞతలు.. కారణం ఏంటంటే..?
-
CPI Ramakrishna: తెదేపాతో కలిసి పని చేసే ఆలోచనలో ఉన్నాం: సీపీఐ రామకృష్ణ