Telangana News: రాష్ట్రంలో మరో 8 మెడికల్‌ కాలేజీలకు పరిపాలన అనుమతి

తెలంగాణలో మరో 8 మెడికల్‌ కాలేజీలకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న లక్ష్యం

Published : 06 Aug 2022 23:41 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మరో 8 మెడికల్‌ కాలేజీలకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న లక్ష్యం దిశగా వైద్యారోగ్యశాఖ మరో అడుగు వేసింది. 8 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, అనుబంధ ఆసుపత్రుల పురోభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేసింది. కొత్తగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రుంభీం ఆసిఫాబాద్‌, జనగాం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.

రాష్ట్ర ఏర్పడగానే తొలి రెండు విడతల్లో భాగంగా 12 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసిన సర్కారు.. తాజాగా మూడో విడతలో భాగంగా మరో 8 జిల్లాల్లో కాలేజీలను ఏర్పాటు చేయనుంది. ప్రతి కాలేజీలో 100 ఎంబీబీఎస్‌ సీట్లకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్టు పేర్కొన్న సర్కారు.. కాలేజీ భవనాల నిర్మాణాలను ఆర్‌అండ్‌బీశాఖకు అప్పగించింది. ఆసుపత్రి భవనాల అప్‌గ్రేడింగ్‌, పరికరాలు, ఫర్నిచర్‌ కొనుగోలు బాధ్యతలను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ 8 మెడికల్‌ కాలేజీలను మొత్తం రూ. 1,479 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజన్న సిరిసిల్లకు రూ.166 కోట్లు, వికారాబాద్‌కు రూ.235 కోట్లు, ఖమ్మం రూ.166 కోట్లు, కామారెడ్డి  రూ.235 కోట్లు, కరీంనగర్‌కు రూ.150 కోట్లు, జయశంకర్‌ భూపాలపల్లికి రూ.168 కోట్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌కు రూ.169 కోట్లు , జనగాం రూ.190 కోట్లు కేటాయించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని