Hyderabad: హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక సమస్య.. 3గంటలు గాలిలోనే చక్కర్లు

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేసియా ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెనుముప్పు తప్పింది.

Updated : 20 Jun 2024 10:39 IST

హైదరాబాద్‌: హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేసియా ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెనుముప్పు తప్పింది. బుధవారం అర్ధరాత్రి దాటాక సుమారు ఒంటి గంట సమయంలో టేకాఫ్‌ అయిన 15 నిమిషాలకే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన వెంటనే పైలట్‌ ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఏటీసీ అధికారులు ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించారు.

విమానంలో ఇంధనం అధికంగా ఉండటంతో ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగుతాయని భావించి సుమారు 3 గంటలు గాలిలోనే చక్కర్లు కొట్టించారు. దీంతో విమానం ఉదయం 3.58 గంటలకు సురక్షితంగా ల్యాండ్‌ అయింది. విమానం సేఫ్‌ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో అందులో సుమారు 138 మంది ప్రయాణికులున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని