Afghanisthan: నా మాతృభూమి.. బాధతో కుమిలిపోతోంది ..

ప్రముఖ గాయకుడు షరఫత్‌ పర్వానీ మాతృభూమిని తలచుకుంటూ పాడిన పాట ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది

Published : 31 Aug 2021 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక ఏ క్షణాన ఏం జరుగుతుందోనని జనం భయంతో గజగజ వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని విదేశాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్‌  ప్రముఖ గాయకుడు షరఫత్‌ పర్వానీ కూడా దేశాన్ని విడిచివెళ్లారు. అమెరికా భద్రతా బలగాల ఆధీనంలోని శరణార్థుల క్యాంప్‌లో తలదాచుకున్నారు. తాజాగా  ఆయన మాతృభూమిని తలచుకుంటూ పాడిన పాట ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ రిపోర్టర్‌ షరీఫ్‌ హసన్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

‘నా మాతృభూమి.. బాధతో కుమిలిపోతోంది. నా మాతృభూమి వేదనను తీర్చే ఎలాంటి మెడిసిన్‌ లేదు’ అంటూ బాధాతప్త హృదయంతో పాడుతున్నట్లుగా ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఒక నిమిషం 50 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో తన మాతృభూమి పడుతున్న వేదనను పాట రూపకంగా తెలిపాడు. తనతో పాటు అఫ్గాన్‌ దేశానికి చెందిన మరికొంత మంది కూడా ఆయనను అనుకరించారు. గుండెల్ని మెలిపెడుతున్న ఆ వీడియోను మీరూ చూడండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని