
Anand Mahindra: యాంఫిబియస్ వెహికల్స్‌ను తయారీ చేయాలనుకుంటా!
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా త్వరలో ‘మహీంద్రా యాంఫిబియస్ వెహికల్స్’లను తయారు చేయాలనుకుంటున్నారు! ఇటీవల ఆయన చూసిన వీడియోలో మహీంద్రా కార్లకు నీటిలోనూ నడవగలిగే సామర్థ్యం ఉన్నట్లు గుర్తించి.. అలాంటి వాహనాలను తయారు చేయాలనుకుంటున్నారు. తాజాగా గుజరాత్‌లోని వరద నీటిలో థార్ కదులుతున్న వీడియోను ఆయన తన ట్విటర్ ఖాతాలో పొందుపరిచారు.
మహీంద్రా థార్ వెహికల్ నదిని దాటుతున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. నీటి ప్రవాహాన్ని తట్టుకొని అది నదిని దాటుతోంది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్ర నెటిజన్లతో పంచుకుంటూ.. ‘‘గుజరాత్‌లోని వరద నీటి ప్రవాహంలో వాహనం ఒడ్డుకు చేరిన వీడియో యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను చాలా మంది షేర్ కూడా చేస్తున్నారు. ఇక మేము ‘మహీంద్రా యాంఫిబియస్ వెహికల్స్’ (MAV!)లను సృష్టించాలనుకుంటా’’ అని ఆయన సరదాగా రాసుకొచ్చారు.