Published : 05 Aug 2022 01:35 IST

Snakebite: పాముకాటుతో వ్యక్తి మృతి.. అంత్యక్రియలకు వచ్చిన సోదరుడూ సర్పానికి బలి

లఖ్‌నవూ: పాముకాటుతో మరణించిన సోదరుడి అంత్యక్రియలకు హాజరైన వ్యక్తి సైతం.. నిద్రలో మరో పాము కరవడంతో మృతి చెందాడు. కుటుంబంపై విధి పగబట్టిందా అన్న తరహా ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. స్థానిక సీఐ రాధారమణ్‌ సింగ్‌ వివరాలు వెల్లడించారు. భవానీపుర్‌కు చెందిన అర్వింద్‌ మిశ్రా(38) మంగళవారం రాత్రి పాముకాటుతో మృతి చెందాడు. బుధవారం అతని అంత్యక్రియలు నిర్వహించగా.. సోదరుడైన గోవింద్‌ మిశ్రా(22) పాల్గొన్నాడు. అదే రోజు రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. అతన్నీ మరో పాము కాటేసింది. అదే ఇంట్లో నిద్రపోతున్న బంధువుల్లో ఒకరైన చంద్రశేఖర్ పాండే(22) కూడా పాము కాటుకు గురయ్యాడని సింగ్ తెలిపారు.

ఈ ఘటనలో గోవింద్‌ మృతి చెందగా.. పాండేను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని అధికారి తెలిపారు. గోవింద్ మిశ్రా, పాండే ఇద్దరూ అర్వింద్ మిశ్రా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు లూథియానా నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు గురువారం గ్రామాన్ని సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కైలాశ్‌ నాథ్ శుక్లా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని