Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Published : 13 May 2021 12:55 IST

1. Covaxin: పిల్లలపై ప్రయోగాలకు DCGI ఓకే

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పిల్లలకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కీలక ముందడుగు పడింది. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశీయ ఔషధ దిగ్గజం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాను రెండేళ్ల చిన్నారుల నుంచి 18ఏళ్ల యువతపై వరకు క్లినికల్‌ ప్రయోగ పరీక్షలు జరిపేందుకు డ్రగ్‌ కంట్రోలర్ జనరల్ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. Covishield: టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచొచ్చు

కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచవచ్చని గురువారం నిపుణుల ప్యానెల్ కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇదే సమయంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా వినియోగిస్తోన్న మరో టీకా కొవాగ్జిన్‌కు సంబంధించి డోసుల మధ్య అంతరంపై ఎలాంటి సూచనలు చేయలేదు. అలాగే కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని గతంలో కేంద్రం ఒకసారి పొడిగించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. AP: రైతు భ‌రోసా నిధుల విడుద‌ల‌

కొవిడ్ క‌ష్ట‌కాలంలో ఆర్థిక వ‌న‌రులు అనుకున్న స్థాయిలో లేక‌పోయిన‌ప్ప‌టీకి రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కూడ‌ద‌ని వైఎస్ఆర్ రైతు భ‌రోసా మొద‌టి విడ‌త‌ నిధుల‌ను విడుద‌ల చేసిన‌ట్లు సీఎం జ‌గ‌న్ అన్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో బ‌ట‌న్ నొక్కి ఆయ‌న ఈ నిధులు విడుద‌ల చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.89 వేల కోట్లు ప్ర‌జ‌ల ఖాతాలోకి నేరుగా పంపామని సీఎం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. Coronavirus: కుటుంబంలో నలుగురు మృతి

మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని క‌రోనా మ‌హమ్మారి క‌బ‌లించింది. 11 రోజుల వ్యవధిలో ఇద్ద‌రు కుమారుల‌తో పాటు త‌ల్లిదండ్రులు చ‌నిపోయారు. ఈ నెల 2న తండ్రి, నాలుగో తేదీ పెద్ద కుమారుడు మృతిచెంద‌గా.. 11న చిన్న‌కుమారుడు చ‌నిపోయారు. హైద‌రాబాద్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ త‌ల్లి(60) మ‌ర‌ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. Adar Poonawalla హామీ ఇచ్చారు..

రెండో దశ కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో.. అర్హులందరికీ వేగంగా టీకాలు అందించాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తమకు మే 20 తరవాత 1.5 కోట్ల కొవిషీల్డ్‌ డోసులు అందనున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సీరం సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు హామీ ఇచ్చారని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. Corona Pension: అనాథలైన పిల్లలకు ₹5000

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ గురువారం వెల్లడించారు. ‘‘కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన చిన్నారులకు ప్రతినెలా రూ. 5000 పింఛను ఇవ్వాలని నిర్ణయించాం. అంతేగాక, ఆ పిల్లలకు ఉచిత విద్యతో పాటు వారి కుటుంబాలకు ఉచితంగా రేషన్‌ అందిస్తాం’’ అని సీఎం చౌహన్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. వేణ్నీళ్ల స్నానంతో.. కొవిడ్‌ రాదా?

కరోనా చికిత్సకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో సమాచారం కోకొల్లలుగా వస్తోంది. ఇందులో భాగంగానే వేడి నీళ్లు తాగడం, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయమవుతోందన్న ప్రచారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ విషయంపై భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. వేడి నీళ్లు కరోనాను చంపడం లేదా తగ్గించడమనేది నిజం కాదని వెల్లడించింది. ప్రయోగశాలలో ప్రత్యేక పద్ధతుల్లో 60-75 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే కరోనా వైరస్‌ మరణిస్తుందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

* Corona: నీటి ద్వారా కరోనాపై ఆందోళన వద్దు

8. Covid Vaccine: టీకా వేయించుకొంటే లాటరీ..!

అమెరికాలో టీకా వేయించుకొనేలా ప్రజలను ఒప్పించడానికి నానాతంటాలు పడుతున్నారు. వారిని టీకా తీసుకొనేలా ప్రోత్సహించేందుకు ఓ ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెడుతున్నారు.  ఈ క్రమంలో బుధవారం ఒహైయో గవర్నర్‌ మైక్‌ డివైన్‌ రాష్ట్ర ప్రజలకు ఓ బంపర్‌ ఆఫర్ ఇచ్చారు. టీకా వేయించుకొన్నవారిలో అదృష్టవంతులకు ప్రతి వారం 1 మిలియన్‌ డాలర్లు(రూ.7.3కోట్లు) బహుమానంగా ఇస్తామని ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. Temple mount: ఇజ్రాయెల్‌-పాలస్తీనా ఘర్షణ వెనక..

పాలస్తీనా-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రెండువైపులా రాకెట్లతో దాడులు జరుగుతున్నాయి. ఇది చినికిచినికి పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇంతకూ... ఉన్నట్టుండి ఎందుకీ గొడవ? దేనికోసమీ యుద్ధ వాతావరణం..? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 

10. Rishabh Pant భవిష్యత్తు భారత సారథి!

రిషభ్‌ పంత్‌ టీమ్‌ఇండియా భవిష్యత్తు సారథి అనడంలో సందేహం లేదని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు. ఐపీఎల్‌లో దిల్లీ  క్యాపిటల్స్‌ను అతడు చక్కగా ముందుకు నడిపించాడని పేర్కొన్నారు. జట్టును గెలిపించాలన్న జ్వాల, నేర్చుకొనే తపన అతడిలో కనిపించాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* IPL 2021: ఆడటం కష్టమేనన్న స్టోక్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని