agnipath: అగ్నివీరుల కోసం విశాఖలో ఎంపికలు!
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల అభ్యర్థులతో సహా యానాం వారి కోసం ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ విశాఖలో ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల అభ్యర్థులతో సహా యానాం వారి కోసం ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ విశాఖలో ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల అభ్యర్థులకు విశాఖలో ఎంపికలు నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ తెలిపింది.
ఆగస్టు 14 నుంచి 31 వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అగ్నివీరుల ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీలోగా రిక్రూట్ మెంట్ ర్యాలీ రిజిస్ట్రేన్ అన్‌లైన్ ద్వారా చేసుకోవాలని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు ఏడో తేదీ నుంచి అడ్మిట్ కార్డులు ఆన్ లైన్ ద్వారా జారీ చేస్తామని తెలిపారు. ఆర్మీ కాలింగ్ మొబైల్ యాప్ ద్వారా అభ్యర్ధుల సందేహాలను తీర్చుకునే అవకాశం కల్పించారు. విశాఖ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయానికి ఫోన్ చేసి (0891-2756959,0891-2754680) తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. ఈ రికార్డులు నమోదవుతాయా?
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
NTR: ‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్