Samatha Murthy: ఒక్కరోజులోనే ఆ క్షేత్రాలను చూసే అదృష్టం: అహోబిలం చిన్నజీయర్‌ స్వామి

శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో వచ్చే నెల 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ

Updated : 31 Jan 2022 14:09 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో వచ్చే నెల 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం వివరాలను అహోబిలం చిన్నజీయర్‌ స్వామి మీడియాకు వివరించారు. శ్రీరామానుజ చరిత్రపై థియేటర్‌లో భక్తులకు ప్రదర్శన ఉంటుందని ఆయన చెప్పారు. పూర్తిస్థాయి తనిఖీల తర్వాతే భక్తులను అక్కడికి అనుతిస్తామన్నారు. సమతామూర్తి కేంద్రం ప్రాంగణంలో 108 దివ్య క్షేత్రాల ప్రతిరూపాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కరోజులోనే వీటన్నింటినీ చూసే అదృష్టం కలుగుతుందని చెప్పారు. 108 దివ్యక్షేత్రాల్లో తిరుపతి, అహోబిలం, పాలసముద్రం, వైకుంఠం తదితర ప్రతిరూపాలు ఉంటాయని అహోబిలం చిన్నజీయర్‌ స్వామి వివరించారు.

‘‘బద్రీ నారాయణ క్షేత్రం కూడా ఇక్కడ ఉంది. తెలుగునాట రెండు దివ్యదేశాలున్నాయి. అందులో ఒకటి తిరుపతి, రెండు అహోబిలం. సమతామూర్తి విగ్రహం దిగువ భాగంలో 108 మెట్లు, 54 ఏనుగులు, 108 పద్మాలు ఉంటాయి. ఒక్కో పద్మదళం 27 అడుగుల పొడవు ఉంటుంది. స్వామివారి చేతిలో ఉన్న త్రిదండం ఆరు వేల కిలోల బరువు ఉంటుంది. సమతామూర్తి బంగారు విగ్రహాన్ని ఆశ్రమంలోనే తయారు చేయించాం. మొదటి అంతస్తులో 48 స్తంభాలున్నాయి. వాటిపై రామానుజాచార్యుల జీవిత చరిత్ర తెలిపే చిత్ర పటాలు ఏర్పాటు చేస్తారు. మొదటి అంతస్తులోని విశ్రాంతి గదిలో అన్ని రాష్ట్రాల చిహ్నాలు ఏర్పాటు చేశాం. సమతామూర్తి కేంద్రం ఆధ్యాత్మికతనే కాదు జ్ఞానాన్నీ అందిస్తుంది’’ అని అహోబిలం చిన్నజీయర్‌ స్వామి అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని